Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు.
Engineer Rashid: ఉగ్రవాద నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణల కారణంగా రషీద్ 2019 నుంచి జైలులో ఉన్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన రషీద్, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఎంపీగా అతడి హోదా అతడి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదని ఎన్ఐఏ…
Yasin Malik: టెర్రర్ ఫండిగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో యాసిన్ మాలిక్ కు జీవితఖైదు పడింది. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు సోమవారం యాసిన్ మాలిక్ కు నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్ మరియు తల్వంత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న మాలిక్‌ను తమ ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ చేసింది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్‌లలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో దర్యాప్తులో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఈ కేసు పాకిస్థాన్ కమాండర్లు లేదా హ్యాండ్లర్ల ఆదేశానుసారం వివిధ నకిలీ పేర్లతో పనిచేస్తున్న టెర్రర్ గ్రూపులు, టెర్రర్ ఫండింగ్, నేరపూరిత కుట్రకు సంబంధించినది.
టెర్రర్ ఫండింగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు యాసిన్ మాలిక్ వివిధ దేశాలు, సంస్థల నుంచి నిధులు సేకరించారనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మే 19న ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్ట్ యాసిన్ మాలిక్ ని టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా తేల్చింది. దీంట్లో భాగంగా బుధవారం న్యాయస్థానం ముందు యాసిన్ మాలిక్ ను అధికారులు హాజరుపరిచారు.…