ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటు వర్షాకాల సమావేశంలో రెండవ రోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సోమవారం కూడా లోక్ సభలో అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చించారు. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడారు. పహల్గాంలో టూరిస్టులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్ గాంధీ అన్నారు.
ఉగ్ర దాడుల్లో జమ్ము కాశ్మీర్ పర్యాటకుల మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం ప్రకటించారు. టెర్రరిస్టుల దాడిని తీవ్రంగా ఖండించారు. పలు ప్రాంతాల నుంచి కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఈ మేరకు ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్…