Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సిలబస్ పూర్తి చేయకుండానే పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని నిన్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కూడా రేవంత్ ఇట్టి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిన్న, నేడు నిరుద్యోగ నిరసనకు పిలుపు నివ్వడంతో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిర్యుద్యోగ మార్చ్‌కు జేఏసీ పిలుపు మేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు.