‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
తెనాలి అసెంబ్లీ స్థానంపై ఆసక్తికర కామెంట్లు చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్.. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్య పొత్తు ఉండొచ్చు అనే ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో.. ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.. ఇక, తాను మొదట్లో వేమూరులో, ఆ తర్వాత తెనాలిలో పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్న ఆలపాటి.. ఒక సీటు అని రాసి పెట్టలేదని.. తనను మానసికంగా సిద్ధం చేయాల్సిన…