రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.