TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులకు టీటీడీ సంతోషకరమైన వార్త ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకోవడానికి ఆఫ్‌లైన్ టికెట్లను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ కొత్త కౌంటర్‌ను టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి వెంకయ్యచౌదరి బుధవారం ప్రారంభించారు. భక్తులు ఇప్పుడు ఈ ప్రత్యేక కౌంటర్ ద్వారా రోజుకు 900 టికెట్లను ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు. ఇప్పటికే ఉన్న కౌంటర్‌లో వర్షాకాలంలో భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను టీటీడీ గుర్తించి, సమయానికి నిర్ణయమైన సౌకర్యాలను అందించాలనే…
శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.…
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి గురించి ప్రసార మాధ్యమాల్లో వచ్చే కార్యక్రమాలకు, ప్రత్యక్ష ప్రసారాలకు ఎంతో ప్రాధాన్యత వుంటుంది. అయితే శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రసారం చేస్తూన్న సుప్రభాత సేవ కైంకర్యాల ప్రత్యక్షప్రసారాలను ఎందుకు నిలిపివేసారు అని నిలదీశారు బిజేపి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. ఏడాది ముందుగానే అగ్రిమెంట్ ఎందుకు రద్దు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఆల్ ఇండియా రేడియా యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వున్న శ్రీవారి భక్తులు స్వామివారి పూజా…
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన కళ్యాణకట్ట సిబ్బంది తీరు విమర్శలకు కారణం అవుతోంది. ఆలయం కేశఖండనశాలలో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు. అక్కడ చేతివాటం చూపించారు 12 మంది క్షురకులు. దేవస్థానం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను పరిశీలించిన ఈవో లవన్న ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. చేతివాటానికి పాల్పడిన 12 మంది క్షురకులను విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల…