అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 22న రామమందిరం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి ఆలయ కమిటీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. రామాలయ ప్రారంభానికి నెల రోజులే సమయం ఉండటంతో తమిళనాడు నమక్కల్ నుంచి 42 గుడి గంటలు అయోధ్యకు బయలుదేరాయి. భారీ లారీలో వీటిని తరలిస్తున్నారు. గుడి గంటలను చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. ఈ గుడి గంటలు…