ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసమని ఇప్పటికే స్టేడియానికి ఇరుజట్ల చేరుకున్నాయి. కాగా.. స్టేడియంకు వెళ్లే ముందు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో తెలుగులో మాట్లాడుతూ మేము వచ్చేశాం.. ముంబై ఫ్యాన్స్ పదండి ఉప్పల్ కు అంటూ తెలిపారు.…