Bandi Sanjay : సిరిసిల్లలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్, కోట్ల, నీలం, కాసు వంటి ప్రముఖుల పేర్లు తొలగించే ధైర్యం ఉందా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు దేశభక్తుడు, స్వాతంత్ర్యం కోసం అనేక…
Bhavani’s Nrityanjali Kalakshetram : ఎన్టీఆర్ ఆడిటోరియం, శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో భవానిస్ నృత్యాంజలి కళాక్షేత్రం యొక్క మూడవ వార్షికోత్సవమహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. వినాయకకౌత్వం.. నారాయణతే నమో నమో.. ఆనందనర్తన గణపతి.. భో శంభో.. ముషీకవాహన.. పలుకే బంగారమాయే.. నరసింహ కౌత్వం మొదలయిన అంశాలను భవానీగారి శిష్యులు 70 మంది నృత్య ప్రదర్శనను ఇచ్చారు. ఈ కార్యక్రమం అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన మంగళం అనే అంశంతో…
తెలుగు భాష సంగీతమైనటువంటి భాష అని.. ఈ మధ్యకాలంలో తెలుగు భాషపై దాడి జరిగిందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలుగు భాషపై పట్టు వీడుతుందన్నారు. రాజకీయ నాయకులు సంక్షేమ అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కానీ భాష గురించి ఆలోచించరన్నారు. కొంతమంది ముఖ్యమంత్రులు మాత్రమే తెలుగు భాష గురించి పట్టించుకున్నారన్నారు.
తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం ఫైల్‌పై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. దీంతో అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఎం. కుమార్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా ఉమేష్ కుమార్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా ప్రతాప్ రెడ్డి, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా యాదగిరి రావు, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, వ్యవసాయ…
KTR: తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగతిస్తామని కేటీఆర్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయంకి పెట్టాలి అని అడిగారన్నారు.