ప్రముఖ అంతర్జాయతీయ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్‌పై నాడా సస్పెన్షన్ వేటు వేసింది. రమేష్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వెల్లడించింది. నాగపురి రమేష్ దగ్గర కోచింగ్ తీసుకున్న ఇద్దరు క్రీడాకారులు డోప్ టెస్ట్ కు నిరాకరించారనే ఆరోపణలు ఉన్నాయి. డోప్ టెస్ట్ కు సాంపిల్స్ ఇవ్వకుండా దాటవేసినట్లు తెలిసింది. ఈ అంశంలో వారికీ కోచ్ గా ఉన్న నాగపురి రమేష్ పై వేటు పడింది. కాగా.. నాగపురి రమేష్ గతంలో ద్రోణాచారి అవార్డు…
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Marriage : అవును.. ఇప్పుడు అబ్బాయిలకు పిల్ల దొరుకుతలేదు. పెళ్లి చేసుకుందామని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా సరే.. అమ్మాయి దొరక్క పెళ్లికాని ప్రసాదుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఎంత చదువుకున్నా.. ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా సరే పిల్ల దొరక్క సింగిల్ ఉండిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా రేషియో సమానంగా లేదు. అమ్మాయిల సంఖ్య కంటే అబ్బాయిల సంఖ్యనే ఎక్కువగా ఉండటంతో పిల్ల దొరకడం కష్టంగా మారిపోయింది. పైగా…
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ చల్లని ముచ్చట చెప్పింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ మరో భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ చిత్రం ఏదో కాదు, ‘L2E ఎంపురాన్’. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను మార్చి 27, 2025న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మురళి గోపి రాసిన కథతో లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్…
తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో గెలిచిన బీజేపీ అభ్యర్థుల మల్క కొమరయ్య, అంజిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో కలిసి పని చేస్తున్న తమ కార్యకర్తలను చూసి గర్విస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అదనంగా జాతీయ విపత్తు నిర్వహణ నిధి (NDRF) నిధులను ఇవ్వనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా బుధవారం ఈ నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణతో పాటుగా ఐదు రాష్ట్రాలకు కలిపి రూ.1,554.99 కోట్లు విడుదల కానున్నాయి. ఇందులో తెలంగాణ వాటా కింద రూ.231.75 కోట్లు అందనున్నాయి. గతేడాది ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన ఎన్‌బీఆర్ఎఫ్ నిధులకు..
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ. 97,500 లుగా ఉంది.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి.