Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు భారీ వర్షాలు
- ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
- తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Alert: ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (శుక్రవారం) భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్ర కోస్తాలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉందని చెప్పారు. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Read also: Fire Accident: హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. పూజ చేసి బయటకు వెళ్ళగానే చెలరేగిన మంటలు..
Also Read
తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిన్న (గురువారం) తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు తేలికపాటి వర్షాలు కురుస్తాయని ఏపీఎస్‌డీఎంఏ ప్రకటించింది.
Diwali Celebrations: దీపావళి వేడుకల్లో అపశృతులు.. 48 మందికి గాయాలు.. 9 మందికి సీరియస్
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!