Rain Alert : గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తుండగా, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షపాతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావమని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిణామాలతో రాబోయే మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు…
Weather Updates :తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి గందరగోళంగా మారింది. భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రోజంతా మేఘాలు కమ్ముకున్నా, వర్షం మాత్రం కొన్ని చోట్లే కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మధ్య, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాయంత్రం తరువాత జల్లులు పడొచ్చని…
Weather Updates : తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలు వడగాల్పుల ప్రభావంతో అల్లాడుతున్నాయి. వాతావరణ శాఖ ఏకంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలు ఆదిలాబాద్, కుమురంభీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరో 21…
Hyderabad Rain : హైదరాబాద్‌లో వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటుచేసుకుంది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉష్ణోగ్రతలు పెరిగి తీవ్ర ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో, ఒక్కసారిగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. ఈ మార్పుతో దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, నాగోల్ వంటి ప్రాంతాల్లో వర్షపు జల్లు కురిసింది. అంతేకాకుండా, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని యాచారం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ తాజా ప్రకటన…