Kedarnath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారు అక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది వెళ్లాగా.. కేదార్‌నాథ్ దర్శనం తర్వాత వీరిలో 14 మంది బద్రీనాథ్‌కు బయల్దేరి వెళ్లారు. వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్- బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి