Kedarnath: కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
- కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు..
- వర్షాలతో కొండ చరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్- బద్రీనాథ్ మార్గంలో నిలిచిన రాకపోకలు..
- రెండు రోజులుగా కేదార్‌నాథ్‌లోనే చిక్కుకున్న నిజామాబాద్.. విజయనగరం యాత్రికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kedarnath: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్‌నాథ్‌లో తెలుగు యాత్రికులు చిక్కుకుపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి వారు అక్కడే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సదరన్ ట్రావెల్స్ ద్వారా 18 మంది వెళ్లాగా.. కేదార్‌నాథ్ దర్శనం తర్వాత వీరిలో 14 మంది బద్రీనాథ్‌కు బయల్దేరి వెళ్లారు. వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్- బద్రీనాథ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రెండు రోజులుగా నిజామాబాద్, విజయనగరం యాత్రికులు కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుని పోయారు. వర్షాలు, తీవ్రమైన చలి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ హెలికాప్టర్ సర్వీసులను అధికారులు నిలిపేశారు.
Read Also: Kamala Harris Vs Donald Trump : ఇక నో డిబేట్స్ ఓన్లీ యాక్షన్.. కమలా హారిస్ పై వెనక్కి తగ్గిన ట్రంప్
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
- Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
ఇక, మరోవైపు కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో తెలుగు దేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడారు.. అధికారులతో మాట్లాడాం.. అందరు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తామని ఎంపీ చెప్పారు. యాత్రికుల ఇబ్బందులపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌తో కలిశెట్టి చర్చించారు. యాత్రికులను వెంటనే రక్షించాలని రెసిడెంట్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. యాత్రికుల్లో పలువురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని.. వారిని హెలికాప్టర్లలో తక్షణమే ఆస్పత్రికి తరలించాలని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు కోరారు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!