MLA Lasya Nanditha: కారు ప్రమాదంలో మరణించిన బీఆర్‌ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంపై కేసు నమోదైంది. పటాన్ చెరు పోలీస్‌స్టేషన్‌లో లాస్యనందిత సోదరి నివేదిత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై 304ఏ ఐపీఎస్ సెక్షన్ కింద ఈ కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా కారు నడిపాడని లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అతివేగంగా కారు నడిపి ఎమ్మెల్యే లాస్య మృతికి కారణమయ్యాడని కేసు నమోదు కాగా.. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు వెల్లడించారు. ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుందని.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Revanth Reddy: లాస్య నందిత భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శివారు ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రమాదంపై పలు విషయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. దర్గాలో పూజలకు వెళ్లి తిరిగి అల్పాహారం కోసం వెళుతుండగా ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే పూర్తి వివరాలు చెప్తామని అడిషనల్ ఎస్పీ వివరించారు.