BJP: యూపీ ఎన్నికల ముందు బీజేపీలో పదవుల జాతర.. పురందేశ్వరికి కీలక పదవి
- బీజేపీలో పదవుల జాతర
- కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ
- పురందేశ్వరికి కీలక పదవి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముచ్చటగా మూడోసారి యూపీలో అధికారంలోకి వచ్చేందుకు కమలనాథులు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని మేధోమథనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదవుల పందెరం చేపట్టారు.
కొత్త జాతీయ కార్యవర్గాన్ని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు దక్కాయి. ఇందులో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కూడా ఉపాధ్యక్ష పదవి లభించింది. ఇక బీజేపీ జనరల్ సెక్రటరీ పదవిని స్మృతి ఇరానీకి కట్టబెట్టగా.. జాతీయ ట్రెజరర్‌గా పీయూష్ గోయల్, బీజేపీ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మరోసారి బీఎల్ సంతోష్‌కు అప్పగించారు. ఇక అన్ని సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్ పదవి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డికి దక్కింది.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
జాతీయ ఉపాధ్యక్షులుగా వీరు
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా వసుంధర రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయ్ పాండా, డి. పురందేశ్వరి, రేఖా వర్మ, వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి, భారతి ప్రవీణ్ పవార్, మన్‌ప్రీత్ సింగ్ బాదల్, లాల్ సింగ్ ఆర్య, ఎం. నాగరాజ, తారిఖ్ మన్సూర్, మధుచంద్ర కర్లను నియమించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శులుగా…
ఇక వినోద్ తావ్డే, స్మృతి ఇరానీలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో వీరికి కీలక బాధ్యతలు అప్పగించారు.
కోశాధికారిగా గోయల్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను బీజేపీ జాతీయ కోశాధికారిగా నియమించారు. కొత్తగా ప్రకటించిన ఆఫీస్ బేరర్లతో పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై నితిన్ నబీన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
BJP chief Nitin Nibin announces names of new office bearers.
Vasundhara Raje Scindia, Tirath Singh Rawat, Ram Madhav, Baijyant Jay Panda, D Purandeshwari, Rekha Verma, Varshaben Narendrabhai Doshi, Bharti Pravin Pawar, Manpreet Singh Badal, Lal Singh Arya, M. Nagaraja, Tariq… pic.twitter.com/dnPE95CDVY
— ANI (@ANI) August 17, 2026
తాజావార్తలు
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?