లోక్‌సభ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు పూర్తి సన్నద్ధతతో ఓటర్లను తమవైపు తిప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రామనగరికి రానున్నారు.
మొబైల్ ఫోన్ వాడనివ్వట్లేదని తన అన్నను ఓ బాలిక హత్య చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాఘర్-చుయిఖదాన్-గండాయ్ (కేసీజీ) జిల్లాలో 14 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడినందుకు తనను మందలించాడని తన అన్నయ్యను నరికి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక సమయంలో ఆర్సీబీ వికెట్లు పోతున్న సమయంలో గుజరాత్ వైపు మ్యాచ్ తిరిగింది. కానీ.. దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చి మ్యాచ్‌ను గెలిపించాడు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ (42), డుప్లెసిస్ (64) పరుగులు చేయడంతో ఆర్సీబీ అలవోకంగా విజయం సాధించింది.
ఏపీలోని ఆ అసెంబ్లీ నియోజకవర్గం మీద అమిత్ షా నుంచి గల్లీ లీడర్ దాకా బీజేపీ నేతలంతా ఫోకస్ పెట్టారు. ఫ్యాన్ మీద పైచేయి కోసం బీజేపీ బెటాలియన్ మొత్తం దిగిపోతోంది. కానీ.... అదే పార్టీకి చెందిన ఒక్క ముఖ్య నేత మాత్రం ఆ వైపే చూడ్డం లేదట. పైగా సెగ్మెంట్లో గట్టి పట్టున్న నాయకుడు ఆయన. జాతీయ నేతలు వస్తున్నా పట్టించుకోని ఆ నియోజకవర్గ నేత ఎవరు? ఎందుకలా చేస్తున్నారు?
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తుని వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్.రమణ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతంతో ఓటమి చెందామని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వేగాన్ని పెంచారు. మరో వైపు తల్లి గెలుపును కాంక్షిస్తూ ఆమె కూతురు మనీషా రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు.
మల్కాజ్గిరి పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ వాళ్లు 10-12 సీట్లు గెలిచిన తర్వాత ఏ పార్టీలో ఉంటదని మాట్లాడుతున్నారు.. ఈ దేశంలో ఇండియా, ఎన్డీఏ కూటమిలో లేని 13 పార్టీలు ఉన్నాయి.. అవన్నీ పెద్ద పార్టీలేనని తెలిపారు. ఈ 13 పార్టీలే రేపు ఢిల్లీని శాసించవచ్చు.. మనం శాసించి లొంగదీసుకుందామా? యాచిద్దామా? అని…
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ భారతీయ జనతా పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామానికి చెందిన సుమారు వంద మంది కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.