కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో హాట్ కామెంట్స్ చేశారు. వందసార్లు రాజ్యాంగాన్ని మార్చిన కాంగ్రెస్ నేతలారా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగంలో ‘సెక్యులర్’ అనే పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? అని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కార్పొరేటర్లను కాంగ్రెస్ కొంటోందని బండి సంజయ్…
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడులో ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు.
ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, రాజ్యాంగం రద్దు చేస్తున్నారని.. అది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.…
పశ్చిమ బెంగాల్లో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హింసకు పేరుగాంచిన ముర్షిదాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఐసిడీఎస్ కేంద్రాలు, ఆట స్థలాలలో బాంబ్ స్క్వాడ్ అనేక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. బాంబుల తయారీకి సంబంధించిన కొన్ని కెమికల్స్ లభ్యమయ్యాయి. కాగా.. బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
అనకాపల్లి జిల్లాలోని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు సొంత గ్రామమైన తారువలో ఉద్రిక్తత ఏర్పడింది. బూడి ముత్యాల నాయుడు, ఆయన కుమారుడు బూడి రవిల మధ్య గొడవ రాజకీయ రచ్చకు దారితీసింది.
ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ(HCU) విద్యార్థి నేత రోహిత్ వేముల క్లోజర్ రిపోర్ట్‌ను రోహిత్ తల్లి రాధిక వ్యతిరేకిస్తున్నారు. రిపోర్ట్‌ను పూర్తిగా మార్చేసారని హెచ్‌సీయూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సెంట్రల్ యూనివర్సిటీలో కొన్ని విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. తాజాగా.. రోహిత్ వేముల తల్లి రాధిక మీడియాతో మాట్లాడారు. రోహిత్ వేముల ఎస్సీ కాదు అని పోలీసులు రిపోర్ట్‌ను హైకోర్టులో సబ్మిట్ చేశారని అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికీ ఎస్సీనేనని తెలిపారు. పోలీసులు రోహిత్…
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని ముస్లిం మైనారిటీ జేఏసీ నేతలు కలిశారు. ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డితో జేఏసీ నేతలు చర్చించారు.
జగన్ పాలనలో అభివృద్ధి లేదని విష ప్రచారం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. "కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం, ఇది కాదా అభివృద్ధి?.. కొత్తగా 4 పోర్టులు నిర్మిస్తున్నాం, ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం.. ఇది కాదా అభివృద్ధి?.. పిల్లలకు ట్యాబులు ఇస్తారని ఎవరైనా ఊహించారా?.. క్వాలిటీ చదువులు అభివృద్ధి కాదా?. -సీఎం జగన్. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్.. 14 ఏళ్లలో ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి చేశారా?"…