మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారని ఏపీ సీఈవో కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. పోలింగ్ కేంద్రం నంబర్ 202లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డయ్యారని తెలిపింది.
ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఓపెనర్లు పెద్దగా పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి క్రీజులోకి వచ్చి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో కేకేఆర్ ఫైనల్ కు దూసుకెళ్లింది. 160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. 13.4 ఓవర్లలో 164 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటింగ్ లో శ్రేయాస్ అయ్యర్ (58*) వెంకటేష్ అయ్యర్ (51*) పరుగులతో చెలరేగారు. అంతకుముందు ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్ (23), సునీల్ నరైన్ (21) పరుగులతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లు పరుగులు…
ఓ కుర్రాడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం లోని భగత్ సింగ్ కాలనీలో గ్యాస్ సిలెండర్ దొంగతనం జరిగింది. పట్టపగలు ఓ లెక్చరర్ ఇంట్లో సిలెండర్ చోరీ జరిగింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తడబడ్డారు. 19.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కేకేఆర్ ముందు 160 పరుగుల ఫైటింగ్ స్కోరును ఉంచారు.
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు.
వైద్య రంగంలో అరుదైన ఘనత లభించింది. న్యూరో సర్జన్ల బృందం 44 ఏళ్ల మహిళకు ఇన్సులర్ బ్రెయిన్ ట్యూమర్‌ను ట్రాన్స్ఫార్మేటివ్, నావెల్ ఐబ్రో కీహోల్ విధానం ద్వారా తొలగించారు. "ఈ అపూర్వమైన ప్రయత్నం ప్రపంచంలోనే మొట్టమొదటిది, న్యూరో-ఆంకాలజీ రంగంలో ఒక ముఖ్యమైన పురోగతిని సూచిస్తుంది" అని చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్ (ACCలు) ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు.
సింగపూర్‌లో విధ్వంసం సృష్టించిన కోవిడ్ KP.2 , KP.1 కొత్త వేరియంట్లు.. ఇప్పుడు భారతదేశంలో వ్యాప్తి చెందుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఇండియాలో 290 KP.2 కేసులు, 34 KP.1 కేసులు నమోదయ్యాయి. అయితే.. ఇవి JN1 సబ్ వేరియంట్లు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. కోవిడ్ కొత్త వేరియంట్లతో ఎలాంటి ప్రమాదం లేదని నివేదిక పేర్కొంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎంచుకుంది.