శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి, ఆహారం రెండూ సరిగ్గా ఉండటం అవసరం. వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మధుమేహం, రక్తపోటు, కాలేయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ బరువు పెరుగుట సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల బరువును నియంత్రించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా…
హైదరాబాద్ లో దొంగల హల్ చల్.. రూ.35 లక్షలు దోపిడీ.. హైదరాబాద్ లో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. నగరంలో దారి దోపిడీ దొంగల ముఠా అమాయకులను హడలెత్తిస్తున్నారు. వ్యాపారస్తులే టార్గెల్ చేస్తూ ప్రజలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాత్రి ఒంటరి వ్యక్తులే టార్గెట్ చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యాపారి వద్ద నుంచి సుమారు రూ.35 లక్షలు దోచుకుని వెళ్లిన ఘటన గుడిమల్కాపూర్ లో సంచలనంగా మారింది. హైదరాబాద్ గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలోని తిబర్మల్ జ్యువెలర్స్…
దేశంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాల బారిన చాలా మంది పడుతున్నారు. ఇవన్నీ అకాల మరణాల ప్రమాదానికి దారితీస్తాయి. యువత కూడా ఈ సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించి చికిత్స తీసుకుంటే ప్రమాదాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తెలంగాణలో అంతరించిపోతున్న జానపద కళారూపాలకు పునర్జీవం తీసుకువచ్చేందుకు… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని… రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావు అన్నారు. కళారంగానికి పెద్దపీట వేస్తుందని.కవులు, కళాకారులు, రచయితలకు సముచితస్థానం కల్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆద్వర్యంలో. రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరై. ప్రభుత్వ మాజీ…
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, అవినీతి, అప్పుల్లో కూరుకు పోయి దివాలా తీస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ఉచితాలు, హామీలు గ్యారంటీల పేరుతో ఎన్నికలకు ముందు చెప్పి ఎన్నికలయ్యాక ప్రజల గోస పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ కటాకట్ కటాకట్ డబ్బులు వేస్తామని చెప్పారని, ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు ఫటాఫట్ దివాలా తీశాయని ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ ఢిల్లీకి ఎటీఎంగా మార్చారని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు రేవంత్ రెడ్డి…
రైలులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడిపై కొందరు యువకులు చితకబాదారు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్లోని ఇగత్పురి సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వృద్ధుడు రైలులో ప్రయాణిస్తుండగా.., అతను బీఫ్ మటన్ తీసుకెళుతున్నాడనే అనుమానంతో కొందరు యువకులు దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని, ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదని ఆయన విమర్శించారు. చీమ కుట్టినట్లు అయినా మీకు లేదు. సిగ్గుచేటని, గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితి అన్నారు హరీష్…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా? అనేది ఇంకా క్లారిటీ లేదు. కాగా.. దీనిపై నిర్ణయం ప్రభుత్వమే తీసుకుంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ క్రమంలో.. భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
షేక్ హసీనా వల్ల భారత్కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్లోనే కొనసాగితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
రష్యాలో ఘోర ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. విమాన టేకాఫ్ సమయంలో హెలికాప్టర్ Mi-8T అదృశ్యమైంది. అయితే.. హెలికాప్టర్ కూలిపోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హెలికాప్టర్ మిస్సింగ్ అయిన సమయంలో అందులో ముగ్గురు సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉన్నారు.