తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 గేట్లు 12 అడుగులు, మరో 2 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
హైడ్రా వల్ల పేదలకు ఎటువంటి నష్టం కలగకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఏ పార్టీ వ్యక్తుల నిర్మాణాలైనా కూల్చివేస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. గతంలో కేటీఆర్ హై సెక్యూరిటీ ఏరియా అని చెప్పి డ్రోన్ ఎగరవేశాడని, విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలని విజ్ఞప్తుల మేరకు మల్లారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి ఆసవుద్దీన్ విద్యాలయలకు హైడ్రా నోటీసులు పంపిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు పంపిందని ఆయన తెలిపారు. గత…
గగన్ పహాడ్ గ్రామంలోని అప్పా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన పదమూడు షెడ్లను హైడ్రా విభాగం శనివారం ఉదయం కూల్చివేస్తున్నారు . శంషాబాద్ పరిధిలో లో 35 ఎకరాల విస్తీర్ణంలో వున్న గగన్ పహాడ్ చెరువులో అక్రమం నిర్మాణాలు జరుగుతున్నట్లుగా హైడ్రాకు పలు ఫిర్యాదులు రావడంతో దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన హైడ్రా అధికారులు అప్పా చెరువులో మూడు ఎకరాల పరిధిలో అక్రమంగా…
ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో దుర్గ గుడి వద్ద పెద్ద చెరువుకు గండి పడింది. పెద్ద చెరువు నీటితో 50 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పది మంది స్థానికులు ఇళ్లల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణ, సమాచారం, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి , ఏలూరు జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
కోల్కతా నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానం కోల్కతా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. టేకాఫ్ తర్వాత, ఇండిగో విమానం 6E0573 యొక్క ఎడమ ఇంజిన్ లోపం కారణంగా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది.
విజయవాడలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భారీ వర్షాలతో విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. కొండచరియలు విరిగి నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలని అడిగారు. సీరియస్గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణా తో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోను భారీ…
గుజరాత్లో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. వర్షాలు, వరదల నుంచి గుజరాత్ ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో.. అస్నా తుఫాను ముంచుకొస్తుంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు.. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. అందులో.. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు-గోళ్లమూడి మధ్య ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మానిక్ మరణించినట్లు తెలిసింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.