హైడ్రా వేరు, మూసీ కార్యక్రమం వేరని, హైడ్రా చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చేస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ సిద్దిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో అనేక సార్లు వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోయిందని, మూసీ నది సంరక్షణ కోసం ఇప్పుడు మూసీ కార్యక్రమం చేపట్టామన్నారు మంత్రి పొన్నం. మూసీ పరివాహక ప్రాంతంలో ఏ ఒక్క ఇల్లు కూడా ఇప్పటివరకు కూల్చలేదని,…
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో శ్రీలంక, న్యూజిలాండ్‌ను 154 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయంతో శ్రీలంక తన గడ్డపై రెండోసారి టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎంఎఫ్సీ) ఐటీ, హెల్త్‌కేర్ సహా వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ కోర్సులను ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలను అక్టోబర్ 4లోగా తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించాలి. శిక్షణ ఉపాధి , ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ పథకం ప్రకారం TMFC ఈ కోర్సులను అందిస్తుంది. ఈ కార్యక్రమం కింద, ముస్లింలు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు , జైనులతో సహా కమ్యూనిటీలకు చెందిన విద్యావంతులైన , నిరుద్యోగ యువత వివిధ…
ప.గో జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖా మంత్రి పొంగూరు నారాయణ, నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాలకొల్లు పట్టణంలో ప్రసిద్ధి చెందిన పురాతన రక్షిత మంచినీటి విభాగం పనితీరును మంత్రి నారాయణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం.. రామగుండం పార్కు, ఎన్టీఆర్ కళాక్షేత్రం, ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. వారిద్దరినీ మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇస్మాయిల్, మహ్మద్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర తిరుగుతుండగా వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) వారిని పట్టుకుని భౌతికంగా తనిఖీ చేసిన తర్వాత మంగళ్‌హాత్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి వారి పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో గోషామహల్ ఎమ్మెల్యే…
ఆ మహిళకు ఏం ఆపద, కష్టమొచ్చిందో.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ కాల్వలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన ఏపీలోని విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెజవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్క్రూ బ్రిడ్జి దగ్గర వండౌడ్ కాల్వలో ఇద్దరు పిల్లలతో సహా కాల్వలోకి దూకింది మహిళ. ఈ క్రమంలో.. అక్కడున్న స్థానికులు గమనించి ఏడాదిన్నర వయసున్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే.. ఆ చిన్నారిని హాస్పటల్‌కు తరలించే లోపే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించాల్సిన ఆర్థిక ప్రగతి, కృత్రిమ మేధ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా కలిగే ప్రయోజనాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకోసం మాస్టర్ కార్డు కేంద్రం ద్వారా సాధిస్తున్న ఆర్థిక ప్రగతి తదితర అంశాలపై ఆయా రంగ ప్రముఖులతో శుక్రవారం ప్రధానంగా చర్చించారు.
రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పండుగ వేళ చేనేత దుస్తులు ధరించుదాం... నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేత కార్మికులు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దాం అని సూచించారు.
బంగ్లాదేశ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది.
శాంసంగ్ (Samsung) తన కొత్త గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది. కంపెనీ శాంసంగ్ ట్యాబ్ ఎస్ 10 (Galaxy Tab S10) సిరీస్‌లో రెండు మోడళ్లను పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాప్ ఎస్ 10 ప్లస్ (Galaxy Tab S10 Plus), గెలాక్సీ ట్యాబ్ ఎస్ 10 అల్ట్రా (Galaxy Tab S10 Ultra) అనే దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కొత్త ఆండ్రాయిడ్ టాబ్లెట్లను లాంచ్ చేశారు.…