డీఎస్పీ (DSP)గా టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం తెలంగాణ డీజీపీకి రిపోర్టు చేసిన తర్వాత.. సిరాజ్ అధికారికంగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతల అహంభావం వల్లే సులభంగా విజయం సాధించాల్సిన హర్యానాలో ఆ పార్టీ ఓడిపోయిందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుంది.. ప్రభుత్వ పాఠశాలలకు కరెంటు బిల్లు ప్రభుత్వమే కడుతుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూల్స్ బాగుకోసం కోట్ల రూపాయాలు కేటాయించామన్నారు. ఇప్పటికీ వున్న ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షన్సియల్ స్కూల్స్ కొనసాగిస్తామన్నారు. ఏవి కూడా ముసేసిది లేదన్నారు. అన్నింటికీ శాశ్వత భవనాలు కల్పిస్తామన్నారు. అడ్డంకులు సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఉడుత ఊపులకు ఎవ్వరూ భయపడే పరిస్థితి లేదన్నారు. ఎవరు…
రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-బంగ్లా మూడో టీ20 మ్యాచ్ కోసం.. పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఉన్నారు. అలాగే.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్ఎస్పీ, 6 ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తు ఉన్నారు.
షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కోందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… 28 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమి పూజ చేశామని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్లు ఆయన తెలిపారు. 25 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్ నిర్మాణం, ప్రత్యేకంగా…
పరిపాలనను పరుగులు పెట్టించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తంగా 49 విభాగాల్లో ఆర్థికేతర సమస్యలను అధికారులు గుర్తించారు. వివిధ అంశాలపై మొత్తంగా 24 పాలసీలు రూపొందించే దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది.
కాశ్మీర్ లో వంద శాతం టార్గెట్ రిచ్ అయ్యామని, హర్యానాలో EVM టాంపరింగ్ జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదు? కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో EVM టాంపరింగ్ ఎందుకు జరగలేదన్నారు కేంద్ర మంత్రి, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇంచార్జ్ కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూలో ఒక రకంగా ఓటర్ల పోలరైజ్.. కాశ్మీర్ లో మరోరకంగా పోలారైజ్ జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రశాంతంగా అత్యధిక పోలింగ్ జరిగిన ఎన్నికల ఇవి అని, హర్యానా ఎగ్జిట్…
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. నెల్లూరు నగరానికి తాగునీటిని అందించే పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీలలో ఇంటింటికి తాగునీరు ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందించామని తెలిపారు.
రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన చేసి.. శిలా ఫలకం ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దసరా నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని.. మంచి పంటలు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రోజునే మేము వాగ్దానం చేసినం..…
మజ్లిస్‌తో సంబంధం వేరు.. లా అండ్ ఆర్డర్ వేరు అని, తప్పు చేస్తే ఎవరికైనా ఒకటే రూల్ అని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ ప్రభుత్వానికి చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త, పాత అంత కలుపుకుని పోతున్నామని ఆయన తెలిపారు. ఏ అంశంలో అయిన ముందు నుండి ఉన్న కాంగ్రెస్ నాయకులకీ ముందు ప్రియారిటీ ఉంటదన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్ రెడ్డి…