జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుసగా ఉగ్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఆర్మీవాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్లో ఆర్మీ వాహనంపై జరిగిన దాడిలో కనీసం ఒక ఉగ్రవాది హతమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉగ్రవాదులతో భద్రతా బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి.
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే అయిన జనాభా గణనను ప్రభుత్వం ప్రారంభించనుందని సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జనాభా లెక్కల అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దీపావళి పండగ సందర్భంగా మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా దీపాలు వెలిగించేటప్పుడు మట్టితో తయారు చేసిన దీపాంతలు వాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
హైదరాబాద్ శివార్లలో జన్వాడలోని రాజ్ పాకాల ఫామ్ హౌస్ పార్టీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నేడు మరోసారి విజయ్ మద్దూరిని మోకిలా పోలీసులు విచారణ చేయనున్నారు. రాజ్ పాకాల ఇంకా పరారీలో ఉన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. పత్తిరేటు తగ్గించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల సెలవులు అనంతరం సోమవారం ప్రారంభం అయిన వ్యవసాయ మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో పత్తిని రైతులు తీసుకువచ్చారు.
హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు పోలీస్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉందన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మహాకూటమిలో బీజేపీ అన్నయ్య పాత్రలో ఉన్నప్పటికీ.. శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత మరోసారి రాష్ట్రంలో మహాయుతి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ముఖ్యమంత్రి ఎవరు? అనే ప్రశ్న ప్రస్తుతం ఉత్పన్నమవుతోంది.
పోలీస్ మాన్యువల్‌కు విరుద్ధంగా ఆందోళనలు చేపట్టిన టీజీఎస్పీ కానిస్టేబుళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించింది. తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతున్న 10 మందిని గుర్తించి.. ఆర్టికల్ 311 ప్రకారం ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. పదిమంది బెటాలియన్స్ కానిస్టేబుళ్లలను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Road Accident: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పేట వద్ద నేషనల్ హైవే 65పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చి మరో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ముందున్న లారీ టైర్ పంచర్ కావడంతో హైవే పక్కకు ఆపి పంచర్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు లారీల మధ్యలో మృతదేహాలు ఇరుక్కుపోవడంతో బయటికి తీయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ని అరగంట…
ఇరాన్ ఆయువుపట్టుపై దెబ్బకొట్టిన ఇజ్రాయిల్.. ఇజ్రాయిల్ శనివారం ఇరాన్‌పై విరుచుకుపడింది. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు నిర్వహించింది. సరిహద్దులో ఇరాన్ రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసిన తర్వాత ఇజ్రాయిల్ దాడులు నిర్వహించింది. ఈ దాడిలో తేలికపాటి వార్హెడ్లను ఉపయోగించాయని ఇరాన్ సైన్యం తెలిపింది. అయితే, ఈ దాడిపై అమెరికన్ నిపుణులు విశ్లేషించారు. ఇజ్రాయిల్ దాడిలో ఇరాన్‌కి చెందిన బాలిస్టిక్ మిస్సైల్ ఫెసిలిటీలపై దాడులు చేసినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ టెహ్రాన్ సమీపంలోని…