రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా రూ.10వేల 400కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డూరంగా, విచిత్రంగా ఉందన్నారు.
హంగేరిలోని బుదాపేస్ట్ జూలో ఈ సంఘటన జరిగింది. ఓ కొలను ఒడ్డు వద్ద కాకి ఒకటి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. అయితే అదే సమయంలో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. నీటిలో పడిపోయిన కాకి అరుపులు గమనించిన ఎలుగుబంటి ఆ కాకి వద్దకు వెళ్లి.. నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి సేవ్ చేసింది. తన నోటి సాయంతో కాకి రెక్కలను పట్టుకుని బయటకు ఆ ఎలుగుబంటి తీసింది.