ప్రస్తుతం దేశంలో దాదాపు 140 కోట్ల జనాభాలో ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. మన దేశంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ( NCRB ) 2021కి సంబంధించిన తాజా గణాంకాలను పరిశీలిస్తే, ప్రజలు ప్రేమలో ప్రాణాలు ఇవ్వరని, ప్రాణాలను తీసుకుంటారని తెలిసింది.
2035 నాటికి దేశవ్యాప్తంగా పొగాకు వినియోగాన్ని 5 శాతం కంటే తక్కువకు తగ్గించాలనే లక్ష్యంగా పెట్టుకుంది కెనడా. అందులో భాగంగానే ఈ నియంత్రణ అమలు చేయనున్నారు. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై ఆరోగ్య సందేశాలను బలోపేతం చేయడంతో సహా దేశంలో ధూమపానం చేసేవారి సంఖ్యను తగ్గించవచ్చని ఆరోగ్య అధికారులు తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ను గణేష్ కుటుంబ సభ్యులు ప్రశ్నించి నందుకు వారిపై కారుతో ఢీ కొట్టిన ఘటన సంచలనంగా మారింది. కారుతో గుద్దడమే కాకుండా వారిని 200 కిలోమీటలర్లు ఈడ్చెకెళ్లాడు. దీంతో బాధితులకు తీవ్ర గాయాలుకావడంతో వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై గణేష్ కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడుతూ..
మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తాజా మటన్ను ఈజీగా గుర్తించవచ్చు. మంచి మటన్, చికెన్ తాజాగా కనిపిస్తుంది. అయితే ఎప్పుడో కట్ చేసినది అయితే పాలిపోయినట్టుగా.. ఎండిపోయినట్టుగా కనబడుతుంది. మటన్ తీసుకునేటప్పుడు దాని నుంచి ఎక్కువగా రక్తం లేదా నీరు కారుతున్నట్లు కనిపిస్తే దాన్ని తీసుకోకపోవడమే మంచిది.
20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. మసూర్ దాల్ కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది.