బ్రిటీష్ జంతు ప్రదర్శనశాలలోని సిబ్బంది ప్రపంచంలోని అత్యంత అంతరించిపోతున్న ప్రైమేట్స్లో ఒకదాని పుట్టుకను జరుపుకున్నారు. అరుదైన సులవేసి క్రెస్టెడ్ మకాక్ కోతి మే 16న చెస్టర్ జూలో ఓ కోతిపిల్లకు జన్మనిచ్చింది.
మనం తినే పండ్లు గానీ, కూరగాయలు గానీ ఫ్రెష్ గా నీటిలో కడుక్కొని తింటాం. తినేముందు వాటిపై ఉన్న తొక్కలను వేరు చేసి లోపల ఉన్న పదార్థాన్ని తింటాం. అయితే తినే పండులోపల కన్నా.. తొక్కతోనే ఎక్కువ లాభాలున్నాయంటున్నారు. నిజానికి ఈ తొక్కల్లోనే మానవుడికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసా..? కొందరు తెలిసిన వారు తొక్కలు కూడా తింటారు.
ముఖ్యంగా మన అలవాట్లలో ముఖ్యమైనది వ్యాయామం. అది చేయకపోవడం వల్లనే బెల్లీ ఫ్యాట్ వస్తుంది. అంతేకాకుండా.. అతిగా తినడం వల్ల కూడా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయి.. బెల్లీ ఫ్యాట్ వస్తుంది. చక్కెరను ఎక్కువగా తిన్నకూడా.. బెల్లీఫ్యాట్ వస్తుంది. అందుకే తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి..