త్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గుండర్ దేహి బ్లాక్ కు చెందిన ఖుతేరి గ్రామ ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఊరిలో ఉండే ట్యాంక్ లోని నీరు తాగి 132 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే గ్రామంలోనే వారికి తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారిలో 112 మంది జ్వరంతో బాధపడుతుండగా.. 5 మందికి వాంతులు విరేచనాలు, 15 మంది జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
Minister KTR: కరీంనగర్ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేసారాయన. జిల్లా గ్రంథాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కార్పోరేషన్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ను మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు. Read Also: Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19..…
Hyderabad Crime: గంటల వ్యవధిలో హైదరాబాద్ లో దారుణ హత్యలు జరిగిపోయాయి. 12 గంటల లోపే ఆరుగురు హత్యకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో వివిధ కారణాలతో.. వివిధ తీరులో హత్యలు జరిగాయి. జరిగిన హత్యలపైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ట్రాన్స్ జెండర్ గా యువకుడిని మార్చే వేసేందుకు ప్రయత్నం చేయగా.. యువకుడు సూసైడ్ చేసుకోవడంతో అతని సోదరులు కలిసి ట్రాన్స్ జెండర్లను హత్య చేశారు. మరొకటి రోడ్డుపై నిద్రిస్తున్న ముగ్గురు వ్యక్తులను బండరాళ్లతో కొట్టి చంపేశారు. ప్రేమించడం…
రాజస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. బికనీర్ లోని ఖజువాలాలో కోచింగ్ తీసుకుంటున్న దళిత బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళవారం ఉదయం కొత్త ధన్మండి రహదారిపై బాలిక మృతదేహం పడి ఉంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు.
పొత్తుపై మాయావతి ఆలోచన చేస్తున్నారా..? ప్రతిపక్ష ఐక్యతపై బీఎస్పీ కన్ను పడిందా?. బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీఎస్పీకి చోటు దక్కలేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా అడుగులు వేయాలనుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా విపక్షాల ఐక్యతపై బీఎస్పీ కన్నేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్పీ అధినేత్రి మాయావతి 2024 లోక్సభ…