జనగామ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం వల్ల ప్రజలు బాధపడుతున్నారన్నారు. breaking news, latest news, telugu news, Ponnala Lakshmaiah, congress
ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యల చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లోని ఛప్రాలో జరిగింది. ముగ్గురి మధ్య గొడవ జరగడంతో 45 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, మాజీ భార్య కత్తితో పొడిచి చంపారు.
గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న వ్యక్తిని ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం, పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సమాచారం అందుకున్న తర్వాత నవీన్ పాల్ అనే వ్యక్తిని క్రాసింగ్స్ రిపబ్లిక్ ప్రాంతం నుంచి పట్టుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ భవనం (విధాన సౌధ)లో ముస్లింల కోసం ప్రార్థన గదిని కోరుతూ జనతాదళ్ (సెక్యులర్) లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC) సభ్యుడు బీఎం ఫరూక్ ఎగువ సభ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే నమాజ్ చేసేందుకు గది కావాలని కోరగా.. ఛైర్మన్ స్పందించలేదు.
నేపాల్‌లోని సోలుకుంబు నుంచి ఖాట్మండుకు ప్రయాణిస్తున్న సమయంలో ఐదుగురు విదేశీ పౌరులతో సహా ఆరుగురితో కూడిన హెలికాప్టర్ ఈ రోజు అదృశ్యమైంది. 9ఎన్ఎండబ్ల్యూ కాల్ గుర్తుతో ఉన్న ఛాపర్ ఉదయం 10:15 గంటలకు కంట్రోల్ టవర్‌తో సంబంధాన్ని కోల్పోయింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో పిటిషన్లపై విచారణ ఉంటుంది.
ప్రతి ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ప్రపంచ జనాభాలో పెరుగుతున్న సవాళ్లు, ప్రభావాలపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ప్రపంచ కార్యక్రమం. మానవుల పెరుగుతున్న జనాభా చాలా ఆందోళన కలిగించే విషయంగా పేర్కొనబడింది. అందుకే ప్రపంచ జనాభాకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిణామాల వంటి ప్రబలమైన సమస్యలను విశ్లేషించడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఉగ్రవాద కుట్ర కేసులో దక్షిణ కశ్మీర్‌లోని ఐదు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ ఏడాది మేలో జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్, షోపియాన్, పుల్వామా, శ్రీనగర్, అనంత్‌నాగ్ జిల్లాల్లోని 13 ప్రాంతాల్లో కూడా ఎన్ఐఏ భౌతిక, సైబర్‌స్పేస్ ద్వారా ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నిన కేసులో సోదాలు నిర్వహించింది.
పాకిస్థాన్‌లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రధాన నగరాలు నీట మునుగుతున్నాయి. జూన్ 25 నుంచి కురుస్తున్న రుతుపవన వర్షాల కారణంగా దాదాపు 86 మంది మరణించగా.. 151 మంది గాయపడినట్లు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) నివేదించింది.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆ ప్రాంతంలో అపూర్వమైన శాంతి నెలకొందని కేంద్రం వెల్లడించింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు సోమవారం 20 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది.