అస్సాం ముఖ్యమంత్రి హిమంత భిస్వా శర్మ ముస్లిం వ్యాపారులపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముస్లిం వ్యాపారుల్ని మియాలుగా సంబోధించిన హిమంత.. వారి వల్లే రాష్ట్రంలో కూరగాయల రేట్లు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
బాలాసోర్ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత భువనేశ్వర్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
అమెరికాలోని కెంటుకీలో ఓ వ్యక్తి తన మొక్కజొన్న పొలంలో అంతర్యుద్ధ కాలం నాటి 700 అరుదైన బంగారు డాలర్లను కనుగొన్నాడు. వాటి విలువ మిలియన్ల కొద్దీ ఉంటుందని అంచనా. కెంటుకీ రాష్ట్రంలో ఓ రైతు తన పొలంలో భూమి దున్నుతుండగా.. ఆటంకం ఏర్పడింది.
భారీ వర్షాలకు ఢిల్లీలో యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుని ఇప్పుడిప్పుడే నది ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద 207.62 మీటర్లుగా నమోదైంది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటలకు యమునా నీటిమట్టం 207.58 మీటర్లుగా నమోదైంది.
కట్నం దురాశతో ఓ వరుడు చేసిన పనికి వధువు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బంధువుల ముందు వధువు కుటుంబసభ్యుల పరువు పోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మరోసారి ట్రిపుల్ తలాక్ ఘటన తెరపైకి వచ్చింది. కట్నంగా కారు ఇవ్వలేదని పెళ్లయిన రెండు గంటలకే వరుడు వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పాడనే ఆరోపణలున్నాయి.
రజాకర్ మూవీ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. జలవిహార్ లో పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. breaking news, latest news, telugu news, bandi sanjay, razakar movie
మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ నేతలపై నిప్పుల చెరిగారు. కాంగ్రెస్ నాయకులు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారని, రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా మాట్లాడారని, రైతుల పట్ల కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. breaking news, latest news, telugu news, harish rao, brs, congress, revanth reddy,
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. వేచి ఉన్న పలువురు ఐఏఎస్‌లకు కూడా పోస్టింగ్‌లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW) కొత్తగా నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ BSc–BEd డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ రూపంలో ఒక మార్గదర్శక విద్యా చొరవను ఇటీవల ఆవిష్కరించింది... NITW introducing BSc BEd four years degree.. breaking news, latest news, telugu news, NITW, big news,