అమరావతిలోని సెక్రటేరియట్లో 'జగన్మోహనం.. అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు తమ చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల మేనిఫెస్టోనే భగవద్గీత.. ఖురాన్.. బైబిల్ అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డ అన్నారు. సర్వమతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను breaking news, latest news, telugu news, big news, revanth reddy
వరల్డ్ కప్ 2023 ఫైనల్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. ఈ మెగా టోర్నీ చివరిపోరులో ఏ జట్టు టైటిల్ గెలుస్తుందో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫలితం రావాలంటే ఒక్కరోజు వేచిచూస్తే సరిపోతుంది. ఈ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉండనుంది. కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం.. టీమిండియా ఇన్నింగ్స్ వేగంగా ప్రారంభించి.. ఆ తర్వాత ఎదురుదెబ్బలను ఎదుర్కొంటుందని తెలుపుతున్నారు. మరోవైపు.. ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరో సెంచరీ సాధించి సరికొత్త…
చంద్రబాబు లాయర్ హైకోర్టులో మెమో ఫైల్ చేశారని.. గుండె పరిమాణం పెరిగిందని చెబుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. వాదనలలో తాను నిప్పు అంటూ స్క్వాష్ పిటిషన్ వేశారన్నారు. మానవతా దృక్పదంతోనే, ఆరోగ్య కారణాలతోనే బెయిల్ వచ్చిందన్నారు. నిజం గెలవాలని తిరిగినా ఆవిడ ఎక్కడుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్నారు అమిత్ షా. అయితే.. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రికి అమిత్ షా తెలంగాణకు. breaking news, latest news, telugu news, big news, amit shah, bjp, telangana elections 2023
బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములకు పట్టాల పంపిణీ జరిగిందన్నారు. మా హయాంలోనే బొంరాస్ పేట్ అభివృద్ధి చెందిందన్నారు.
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. తొలి సెమీ ఫైనల్ ఇండియా-న్యూజిలాండ్ తలపడగా.. భారత్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇక.. రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో గెలుపొంది.. ఫైనల్లో టీమిండియాతో తలపడనుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మెగా పోరు జరుగనుంది.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఈవోగా రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే బదిలీ అయిన ఆజాద్‌కు కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీసీసీఐ ముగింపు వేడుక నిర్వహణపై ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. వరల్డ్ ఫేమస్ సింగర్ ‘దువా లిపా’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సమాచారం. దువా UEFA ఛాంపియన్స్ లీగ్‌తో సహా కొన్ని ఇతర క్రీడా కార్యక్రమాలలో ప్రదర్శన ఇచ్చింది.