రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానులకు శుభవార్త. ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’తో ఓ సక్సెస్ ను అందుకున్న హీరో అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల క్రితం తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్’. ఈ సినిమా ఎట్టకేలకు స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం అనుకున్నంత రీతిలో…