తెలుగు వారికి అత్యంత ఇష్టమైన పండుగ సంక్రాంతి. దశాబ్దాలుగా మనం జనవరి 14వ తేదీనే సంక్రాంతి జరుపుకోవడం అలవాటు చేసుకున్నాం. కానీ, గత కొన్ని ఏళ్లుగా సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం మనం గమనిస్తూనే ఉన్నాం. మన దేశంలోని ఇతర పండుగలు చంద్రుడి గమనం (చాంద్రమానం) ప్రకారం మారుతుంటాయి, కానీ సంక్రాంతి మాత్రం సూర్యుని గమనం (సౌరమానం) ఆధారంగా వస్తుంది. మరి ఇలాంటి పండుగ తేదీ ఎందుకు మారుతోందో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన…
Bhogi Festival: తెలుగు పండుగల్లో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు.. మూడు రోజుల పాటు సాగే ఈ మహాపండుగలో తొలి రోజు భోగి పండుగ.. రెండో రోజు సంక్రాంతి.. మూడో రోజు కనుక జరుపుకుంటారు.. ఆ తర్వాత ముకనుమ అని కూడా నిర్వహిస్తారు.. అయితే, పాతదాన్ని విడిచిపెట్టి.. కొత్తదాన్ని ఆహ్వానించే సందేశంతో భోగి జరుపుకుంటారు. ఈ రోజున జరిగే ఆచారాల్లో అత్యంత ఆకర్షణీయమైనది, భావోద్వేగంతో నిండినది భోగి పండ్లు పోయడం. భోగి పండుగ ప్రాముఖ్యత…
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పేరొందిన భద్రాచలం రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరగనుంది. మిథిలా స్టేడియంలోని శిల్ప కళాశోభిత కళ్యాణ మండపం ఈ మహోత్సవానికి వేదిక కానుంది. ప్రత్యేక ఆకర్షణగా, తొమ్మిది సంవత్సరాల విరామం తర్వాత ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015, 2016 సంవత్సరాల్లో అప్పటి సీఎం కేసీఆర్ ఈ…
తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు శైవక్షేత్రాలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అభిషేక ప్రియుడైన భోలాశంకరుడికి ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలను ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. కాళేశ్వరం ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదిలో పుణ్యస్నానాలు, ఆలయంలో స్వామి వారికి భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటలకు…