Home
Telugu Cinema
Telugu Cinema News
-
Tabu: పూరీ సినిమాలో టబు బోల్డ్ రోల్?
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎక్కువగా రాత్రి షెడ్యూల్లో షూటింగ్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఇప్పటికే టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఈ సినిమాలో ఆమె పోలీస్ అధికారిగా కనిపించబోతున్నట్లు ముందు ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు తాజాగా ఆమె పాత్ర గురించి మరో రకమైన ప్రచారం మొదలైంది. Also Read:Kota… -
Kota Srinivasa Rao : కన్నీటి వీడ్కోలుతో ముగిసిన కోట అంత్యక్రియలు
తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు (83) అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జులై 13 తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం తెలుగు సినీ రంగంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కోట శ్రీనివాసరావు పార్థివ దేహం ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు అంతిమ యాత్రగా కొనసాగింది. ఈ యాత్రలో వందలాది… -
SS Rajamouli: ఎక్కడకొచ్చి ఏం చేస్తున్నావ్?.. రాజమౌళి అసహనం!
ఎస్ ఎస్ రాజమౌళి తాజాగా ఒక యువకుడిపై అసహనం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి, ఈ రోజు ఉదయం తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటులలో ఒకరైన కోట శ్రీనివాసరావు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగానే దర్శక ధీరుడు రాజమౌళి కూడా కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించి,… -
Kota Srinivas Death : ‘కోట’ రాజకీయాలను ఎందుకు వదిలేశాడు..?
Kota Srinivas Death : విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాస రావుకు సంబంధించిన అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. కోట శ్రీనివాస్ నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ సత్తా చాటారు. 1999లో కోట రాజకీయ తెరంగేట్రం చేశారు. అప్పటికి ఊపులో ఉన్న కాంగ్రెస్, టీడీపీని కాదని.. బీజేపీలోకి వెళ్లారు. విద్యాసాగర్ రావు ప్రోత్సహించడంతో బీజేపీ తరఫున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ… -
Chandrababu : నటన అంటే ఏంటో చూపించాడు.. సీఎం చంద్రబాబు నివాళి..
Chandrababu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కోట శ్రీనివాస్ మరణం చాలా బాధాకరం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఇండస్ట్రీకి నటన అంటే ఏంటో చూపించారు. 40 సంవత్సరాలు తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు కోట శ్రీనివాస్. నేను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన… -
Kota Srinivas Death : నటనతో ఇండస్ట్రీ ఉలిక్కిపడేలా చేశాడు.. ఆర్.నారాయణ మూర్తి కామెంట్స్
Kota Srinivas Death : కోట శ్రీనివాసరావు మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ మృతదేహానికి ఆర్.నారాయణ మూర్తి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నేను, కోట శ్రీనివాస్ ఒకేసారి కెరీర్ స్టార్ట్ చేశాం. ప్రాణం ఖరీదు సినిమాతో ఎంట్రీ ఇచ్చాం. ఆ తర్వాత కోట శ్రీనివాస్ వెనక్కి తిరిగి చూసుకోకుండా వందలాది సినిమాల్లో నటించారు. నటనలో ఆయనకు తిరుగు లేదు. నవరసాలు పండించిన నటుడు ఆయన.… -
Babu Mohan : కోటన్న వెళ్లిపోయాడు.. లైవ్ లో ఏడ్చిన బాబు మోహన్..
Babu Mohan : కోట శ్రీనివాస్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న బాబు మోహన్ ఆయన ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు. కోట శ్రీనివాస్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ అందరికంటే నాకు ఆత్మీయుడు. నాకు సొంత అన్న లాంటి వాడు. ఆయనకు తమ్ముడు ఉన్నా నన్నే సొంత తమ్ముడిగా చూసుకున్నారు. మొన్న… -
Kota Srinivas Death : కోట శ్రీనివాస్ కు ఎన్టీఆర్, మహేశ్ సంతాపం..
Kota Srinivas Death : కోట శ్రీనివాస్ మరణం అటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంపై జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ సంతాపం తెలిపారు. ఎన్టీఆర్ తెలుగులో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘కోట శ్రీనివాసరావు గారు… ఆ పేరే చాలు. ఎనలేని నటనా చాతుర్యం.ప్రతి పాత్రలో తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు. నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన, పంచుకున్న క్షణాలు… -
Venkaih Naidu : గొప్ప మానవతా వాది.. ‘కోట’కు వెంకయ్య నాయుడు నివాళి
Venkaih Naidu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాస్ రావు మరణం విచారకరం అన్నారు. కోట శ్రీనివాస్ గొప్ప మానవతావాది. అంతకు మించిన గొప్ప నటుడు. విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన సినిమాలలో కనిపిస్తే హాస్యం పండుతుంది. బిజెపి లో చేరి విజయవాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో సేవలు చేశారు. ఆయన కుమారుడి మరణం ఆయన జీవితాన్ని… -
Kota Srinivas Death : కోట మరణంపై బండి సంయ్, ఈటల సంతాపం..
Kota Srinivas Death : కోట శ్రీనివాస్ మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో జాతీయ, నంది అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఏపీలో బీజేపీని ఆయన గుర్తించారు. అసెంబ్లీలో సినీ…
తాజావార్తలు
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు