UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
- యూఏఈ రస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- బస్సు-ట్రక్కు ఢీ, 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాస్ అల్ ఖైమా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. అయితే, ఎంత మంది భారతీయులు మరణించారనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాస్ అల్ ఖైమాలోని అల్ వతన్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. 41 మందిలో వెళ్తున్న ప్రయాణికుల బస్సు, సాంకేతిక సమస్య కారణంగా రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో తొలుత 11 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ ఘటనలో మరో 14 మంది గాయపడ్డారు.
Also Read
- Sheikh Hasina: ‘‘అప్పగింత’’ ద్వారానే రావాలి.. షేక్ హసీనా రాకపై బంగ్లాదేశ్ యూటర్న్!
- Russia Nuclear Satellite: అంతరిక్షంలో రష్యా అణుబాంబు.. న్యూక్లియర్ శాటిలైట్‌పై ఆందోళన.!
- Pakistan: అసిమ్ మునీర్ ప్లాన్‌పై రగులుతున్న పాకిస్తాన్.. ప్రత్యేక ‘‘సింధు దేశ్’’ కోసం డిమాండ్..
- Nepal Earthquake: నేపాల్‌లో భారీ భూకంపం.. సిక్కిం, బెంగాల్లోనూ ప్రకంపనలు..!
ఈ ప్రమాదంలో భారతీయులు మరణించడంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. వారికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. బాధితులకు సహాయం అందించేందుకు 24 గంటల పాటు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 800-46342ను కూడా ప్రకటించింది.
దీనికి ముందు యూఏఈలో నవంబర్ 13న ఫుజైరాలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 23 వాహనాలు, ట్రక్కులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 14 మంది మరణించగా, వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారు. మరో 30 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఏడుగురు భారతీయులు ఉన్నారు.
తాజావార్తలు
-
UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
-
School Picnic Tragedy: సరదాగా పిక్నిక్కు వెళ్లి.. ఊయల తగిలి పదేళ్ల బాలుడు మృతి.!
-
Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
OTR: నిడదవోలులో కూటమి కుమ్ములాట.. వైస్ చైర్మన్ పదవితో రచ్చ..!
-
OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!