Home
Telugu Cinema
Telugu Cinema News
-
Mailurai : టాలీవుడ్’కి మరో లేడీ నిర్మాత
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు లేడీ బాస్‌ల హవా నడుస్తోంది. మహిళా నిర్మాతల జాబితాలోకి మరో యువ నిర్మాత హన్సిక పెద్దిరెడ్డి ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె నిర్మిస్తున్న తొలి చిత్రం ‘మైలురాయి’ టైటిల్ లాంచ్ ఈవెంట్లో మెగా బ్రదర్ నాగబాబు చేసిన సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషన్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను లాంచ్… -
Ori Nayano : టాలీవుడ్లో సరికొత్త సెన్సేషన్..కేవలం 25 రోజుల్లోనే సినిమా షూట్ ప్లానింగ్?
సాధారణంగా టాలీవుడ్లో ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ పూర్తవ్వాలంటే కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతోంది. కానీ, ఎలాంటి రాజీ లేకుండా కేవలం 25 రోజుల్లోనే మొత్తం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి, వచ్చే ఫిబ్రవరిలోనే థియేటర్లలోకి దించుతామని ఓ యంగ్ టీమ్ టార్గెట్ పెట్టుకోవడం ఇప్పుడు ఫిలింనగర్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పక్కా ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్‌తో బరిలోకి దిగుతున్న ఆ ప్రాజెక్ట్ పేరే ‘ఓరి నాయనో’. ‘ఎవ్రీ లైఫ్ విల్ హావ్ ఓరి..… -
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
Sree Vishnu: వరుసగా నవ్వులు పంచే ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లతో తనకంటూ పక్కా మార్కెట్ సెట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఎట్టకేలకు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడూ సేఫ్ గేమ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా, ఈసారి ఏకంగా మైథాలజీ కథతో బిగ్ రిస్క్ తీసుకోబోతున్నారనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇది ఆయన కెరీర్‌కు మరో బలమైన టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు… -
Vijayendra Prasad : ఏప్రిల్ 7 2027న వారణాసి తప్పకుండా రిలీజ్ అవుతుంది
దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఎక్కడ మైక్ పట్టినా, ఫ్యాన్స్‌కు కచ్చితంగా ఏదో ఒక క్రేజీ అప్డేట్ దొరకడం పక్కా. తాజాగా ఆయన ఓ చిన్న సినిమా ఫంక్షన్లో పాల్గొని, ఏకంగా ఓ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఎలాంటి ముందస్తు హడావిడి లేకుండా ఆయన ఇచ్చిన ఈ బిగ్గెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ (Dad’s Little Friend) సినిమా టీజర్ లాంచ్… -
Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
దశాబ్దాలుగా వెండితెరపై తన స్టెప్పులతో, ఫైట్లతో, మాస్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు రూటు మార్చారు. సిల్వర్ స్క్రీన్‌ను శాసించిన ఈ బాక్సాఫీస్ రారాజు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా ‘చిరంజీవీస్ మెగావర్స్’ (Chiranjeevi’s MegaVerse) పేరిట ఓ సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఓటీటీల్లో టాక్ షోల ట్రెండ్ విపరీతంగా నడుస్తున్న ఈ కాలంలో.. సాక్షాత్తూ ఇండస్ట్రీ పెద్ద,… -
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ ప్రీ రిలీజ్ వేదికపై హీరో నారా రోహిత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తన తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులపై ఆయన చేసిన ‘స్వీట్ కంప్లైంట్స్’ ఈవెంట్ మొత్తానికి హైలైట్‌గా నిలిచాయి. ఎప్పుడూ సైలెంట్‌గా, డిసిప్లిన్‌గా ఉండే రోహిత్‌ను.. త్రివిక్రమ్, తమన్, వెంకటేష్ లపై కంప్లైంట్స్ చేయాలని యాంకర్ కోరడంతో ఆయన సరదాగా వారి గుట్టు విప్పేశారు. త్రివిక్రమ్… -
Destiny : హీరోగా జబర్దస్త్ ఇమాన్యుయేల్ సెన్సేషన్.. ‘డెస్టినీ’కి అనిల్ రావిపూడి బ్యాకింగ్!
బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో, పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ ఇమాన్యుయేల్ ఇప్పుడు ఏకంగా సిల్వర్ స్క్రీన్ పై లీడ్ రోల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు ‘డెస్టినీ’ చిత్రంతో మెయిన్ రోల్ ప్లే చేస్తూ అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే, ఇమాన్యుయేల్ తొలి ప్రయత్నానికి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి లాంటి బడా దర్శకుడి బ్యాకింగ్ దొరకడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.… -
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో నేషనల్ అవార్డు కొట్టి సౌత్‌లోనే టాప్ హీరోయిన్గా నిలబడింది కీర్తి సురేష్. సావిత్రి గారి పాత్రలో ఆమె చూపించిన నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ మూవీ తర్వాత కీర్తి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ, తెరపై అంత పెద్ద హిట్ చూసిన తర్వాత కూడా.. ఆమె నిజ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారంటే ఎవరూ నమ్మలేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, ‘మహానటి’ తర్వాత తాను ఫేస్ చేసిన… -
Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
Mouli: యూట్యూబ్‌లో తన వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుని, లిటిల్ హార్ట్స్ సినిమాతో మొదటి ప్రయత్నంలో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో మౌళి తన రాబోయే ప్రాజెక్టులపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా ఇండస్ట్రీకి వచ్చే యంగ్ యాక్టర్స్ మాస్ హీరో అవ్వాలనో, పక్కా కమర్షియల్ బొమ్మ పడాలనో గట్టిగా ప్లాన్ చేసుకుంటారు. కానీ మౌళి మాత్రం భవిష్యత్తులో ఫలానా తరహా సినిమాలే చేయాలనే ఆలోచన తనకి అస్సలు… -
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సుమారు 25 ఏళ్ల తర్వాత వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆదర్శ కుటుంబం (AK-47)’. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీ మామ ఫుల్ జోష్‌లో కనిపించారు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత త్రివిక్రమ్‌తో మళ్లీ ఎలాంటి సినిమా చేయాలనే ప్రెజర్ ఉండేదని, కానీ సూపర్ థ్రిల్, సస్పెన్స్, అద్భుతమైన ఎమోషన్స్‌తో త్రివిక్రమ్ తెచ్చిన ఈ స్క్రిప్ట్…
తాజావార్తలు
-
Sreeleela : శ్రీ లీల బ్యాడ్ టైం ఇంకా అయిపోలేదా?
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!