ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా ఓపెనింగ్ డే రోజు నుండే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసుకుంటు వెళ్ళాడు నీల్. కానీ ఇటీవల ఈ సినిమా షూట్ కు అనుకోకుండా బ్రేక్ పడింది.
Also Read : Tollywood : 15 రోజుల గ్యాప్ లు రెండు సినిమాలు దించుతున్న ప్లాప్ బ్యూటీ
దానికి తోడు ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఈ లుక్ చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందారు. మరీ లీన్‌గా ఉన్నాడేంటని అనుకున్నారు. దానికి తోడు సినిమా ఆగిపోయిందని వార్తలు ఫ్యాన్స్ ను ఎక్కువ టెన్షన్ పెట్టాయి. వాటన్నికి ఒకే ఒక్క ఫొటోతో సమాధానం ఇచ్చాడు నీల్. తాజాగా ఎన్టీఆర్ – నీల్ ఫోటోను రిలీజ్ చేసారు మేకర్స్. సెలూన్ లో ఎన్టీఆర్ కు దగ్గరుండి మరి స్టయిలింగ్ చేపిస్తున్నాడు నీల్. కాసేపటికి క్రితం వదిలిన ఈ స్టిల్ సొషల్ లో వైరల్ గా మారింది. పులి వేటకి సిద్దమవడాని రెడీ అవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డ్రాగన్ సినిమాను రెండు పార్ట్స్ గా తీసుకురాబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఫస్ట్ పార్ట్ కు సంబందించిన సెకండ్ షెడ్యూల్ ను ఈ నెల చివరి వారం లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో యూరప్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఒక్క ఫొటోతో ట్రోలర్స్ కు చెక్ పెట్టేసారు మేకర్స్.