HISFF : హైదరాబాద్‌లో కొత్త సినీ పండుగకు శ్రీకారం.!
- ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చేతుల మీదుగా HISFF వెబ్‌సైట్ ప్రారంభం
- డిసెంబర్ 19 నుండి 21 వరకు ఐమాక్స్ థియేటర్‌లో ఫెస్టివల్
- 3 సెకన్ల నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ కు ఆహ్వానం
- పాల్గొననున్న అంతర్జాతీయ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HISFF : హైదరాబాద్ నగరం మరో అంతర్జాతీయ సినీ వేడుకకు వేదిక కానుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ (HISFF) వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ వెబ్‌సైట్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ దిల్ రాజు, ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రియాంక సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ..హైదరాబాద్‌కు ఉన్న సినీ గుర్తింపును మరింత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ఈ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఉద్దేశ్యం అని అన్నారు.
China’s 3rd Aircraft: అమెరికాకు సవాల్ విసిరిన చైనా! మూడో యుద్ధ నౌక ప్రవేశం..
Also Read
షార్ట్ ఫిలిం మేకర్లకు ఇది తమ ప్రతిభను ప్రపంచానికి చూపించే గొప్ప వేదిక అవుతుందన్నారు దిల్ రాజు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 19, 20, 21 తేదీల్లో ఘనంగా జరగనుంది. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ ఈ అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవానికి వేదిక కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షార్ట్ ఫిలిం మేకర్లందరికీ ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. పాల్గొనదలచిన వారు 3 సెకన్ల నుంచి 25 నిమిషాల వరకు నిడివి గల షార్ట్ ఫిలిమ్స్ తయారు చేసి, HISFF అధికారిక వెబ్‌సైట్ hisff.in ద్వారా నేరుగా అప్‌లోడ్ చేయాలి. ఫెస్టివల్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్థాయి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు పాల్గొననున్నారు. ఫెస్టివల్ చివరి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిని ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
అంతర్జాతీయ సినీ ఉత్సవాల వేదికగా హైదరాబాద్ ప్రతిష్టను పెంచడమే తమ లక్ష్యమని దిల్ రాజు చెప్పారు. అదే సమయంలో ఆయన వెల్లడించిన మరో అంశం.. వచ్చే ఏడాది నవంబర్ 14 నాటికి అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాన్ని (ICFF) హైదరాబాద్‌లో నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!