Hyderabad: సరదాగా ఆడుకుంటూ పిల్లలు తెచ్చిన పంచాయితీ... ఓ నిండు ప్రాణం బలితీసుకుంది. నా కొడుకునే మందలిస్తావా అంటూ.. ఓ తండ్రి చేసిన దాడిలో మరో పిల్లాడి తండ్రి బలయ్యాడు. పిల్లలకు సర్ధిచెప్పాల్సిన పెద్దలు.. రోడ్డెక్కి పిడిగుద్దులు గుద్దుకున్నారు. కాసేపటికే ఓ పిల్లాడి తండ్రి చాతినొప్పి అంటూ తల్లిడిస్తూ పడిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఘట్‌కేసర్ పరిధిలోని ఔషపూర్‌లో జరిగిన ఘటన విషాదం నింపుతోంది.
వారిద్దరూ వరుసకు బావా మరదళ్లు. అయినంత మాత్రాన వివాహేతర బంధం అంటగట్టారు. అంతే కాదు.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్న తమ భాగస్వాముల నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కున్నారు. చిత్ర హింసలు అనుభవించారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది కలిసే ఆత్మహత్య చేసుకున్నారు. బంధుత్వం, ప్రేమ, సమాజపు ఒత్తిళ్లు.. ఈ మూడింటి మధ్య ఊగిసలాడుతూ, ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో కలకలం రేపింది..
IRCTC Maharajas Express : సాధారణంగా బస్సు కంటే రైటు టిక్కెట్ల ధరలు తక్కువగా ఉంటాయి. ఖర్చు తక్కువగానూ సౌకర్య వంతంగా ఉంటుందని ఎక్కువ మంది రైలు ప్రయాణం వైపే మొగ్గు చూపుతారు.