నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో స్థాపించిన సేవా సంస్థ 100 Dreams Foundation ద్వారా, సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం కూతురు స్రవంతికి PRK హాస్పిటల్ లో రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు. చిత్ర పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధ పడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ…
తెలుగు సినిమాల్లో పలు చిత్రాలలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నటుడు శ్రీధర్ రెడ్డి కుమారుడు అమెరికాలో మిస్ అయ్యాడు. అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్‌లో శ్రీధర్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి మిస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11 గంటలకు అమెరికా ఎయిర్‌పోర్ట్ నుంచి తన కొడుకు మనీష్ రెడ్డి వీడియో కాల్ చేశాడని, ఆ తర్వాత కాంటాక్ట్‌లోకి రాలేదని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. Also Read:Sai Pallavi :…
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15, 2025కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఎన్నికల నీతి నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు…
బ్రహ్మానందం ఈవెంట్లో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. ఇక రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. ఈమధ్య కొంతమంది అలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని కానీ తన ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Allu Arjun: సంధ్య తొక్కిసలాట ఘటన కేసులో చిక్కడపల్లి పీఎస్‌లో హీరో అల్లు అర్జున్ విచారణ పూర్తి అయింది. విచారణ ముగిసిన అనంతరం ఎవరితో మాట్లాడకుండానే అల్లు అర్జున్ కారులో వెళ్లిపోయారు. అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి మంగళవారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన, అనంతరం జరిగిన…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో అనేకచోట్ల కొందరు నటులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో తెలుగు నటి లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. తెలుగులో విడుదలైన పొలిమేర సిరీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి నేడు నామినేషన్ దాఖలు చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుండి సాహితి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ…
అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆస్పత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కీలక అప్‌డేట్ ఇస్తూ.. ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా.. అభిమానులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
Today (06-01-23) Business Headlines: ఖమ్మంలో ‘గోద్రెజ్’ ప్లాంట్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ ఆసక్తి ప్రదర్శించింది. ప్రపంచ స్థాయిలో వంట నూనె ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఖమ్మం జిల్లాలో ఏర్పాటుచేయనుంది. దీనికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. ఈ మేరకు ఎండీ బలరాం సింగ్ నేతృత్వంలోని గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు నిన్న గురువారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ని కలిశారు.
తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు వినగానే, ఆయన విలక్షణమైన అభినయం ముందుగా గుర్తుకు వస్తుంది. ధనుష్ తండ్రి కార్తిక్ రాజా తమిళ చిత్రసీమలో పేరు మోసిన రచయిత, దర్శకుడు. అన్న సెల్వరాఘవన్ పేరున్న దర్శకుడు. ఆరంభంలో వారి నీడన నిలచిన ధనుష్ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు అయ్యాడు. ఇవన్నీ ధనుష్ కు మొదటిరోజుల్లో కాసింత గుర్తింపు తేవడానికి పనికి వచ్చాయి. తరువాత అంతా ధనుష్ స్వయంకృషితో సాధించుకున్నదే. తమిళ, తెలుగు, మళయాళ చిత్రాల్లో…
“కళ్ళ కింద క్యారీ బ్యాగులు…” ఉంటేనేం, కామెడీతో కబడ్డీ ఆడగలిగే సత్తా ఉంటే చాలు, నందులు నడచుకుంటూ రావలసిందే! అంతటి ధీమాతోనే ఎమ్.ఎస్.నారాయణ నవ్వులు పూయించారు. అందువల్లే ఎమ్మెస్ నారాయణను ఐదు సార్లు బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డులు వరించాయి. ఎమ్మెస్ నారాయణ తెరపై కనిపిస్తే చాలు, అసంకల్పితంగా ప్రేక్షకుల పెదాలు విచ్చుకొనేవి. ఇక ఆయన కదిలితే చాలు జనానికి చక్కిలిగింతలు కలిగేవి. నోరు విప్పి మాట్లాడితే కితకితలే! పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రులో 1951…