తెలుగు సినిమాల్లో పలు చిత్రాలలో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన నటుడు శ్రీధర్ రెడ్డి కుమారుడు అమెరికాలో మిస్ అయ్యాడు. అమెరికాలోని అట్లాంటా ఎయిర్‌పోర్ట్‌లో శ్రీధర్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి మిస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీ రాత్రి 11 గంటలకు అమెరికా ఎయిర్‌పోర్ట్ నుంచి తన కొడుకు మనీష్ రెడ్డి వీడియో కాల్ చేశాడని, ఆ తర్వాత కాంటాక్ట్‌లోకి రాలేదని శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:Sai Pallavi : బాలీవుడ్ హీరోకి అండగా నిలిచిన సాయి పల్లవి..
అయితే, తన కొడుకు ఫోన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నట్టు అమెరికన్ ఒకరు సమాచారం ఇవ్వగా, శ్రీధర్ రెడ్డి తన స్నేహితుడిని ఎయిర్‌పోర్ట్‌కు పంపించారు. అయితే, అక్కడ ఫోన్ లేనట్లు తేలిందని శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో, అమెరికా పోలీసులు లొకేషన్ ట్రేస్ చేసి తన కుమారుడిని రక్షించాలని శ్రీధర్ రెడ్డి తన భార్యతో కలిసి మీడియా ముందుకు వచ్చారు.
Also Read:ShraddhaDas : శ్రద్దగా, పద్దతిగా.. నడుమందాలు చూపిస్తున్న శ్రద్దా దాస్
మనీష్ మిస్సింగ్ కేసు నేపథ్యంలో శ్రీధర్ రెడ్డి దంపతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తన కుమారుడిని డబ్బు కోసం ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఏం జరిగిందనే విషయంపై టెన్షన్‌లో ఉన్నారు. తన కుమారుడి ఆచూకీ తెలిసేలా ఇండియన్ అధికారులు సహాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఇక ఈ అంశంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా ఆయన వెల్లడించారు.