సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ కేసులో ఇవాళ కీలక పరిణమాలు చోటుచేసుకున్నాయి.. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు.. ఓ వైపు అరెస్ట్‌లు చేస్తుంటే.. మరోవైపు దిద్దిబాటు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. తెలుగు అకాడమీ డైరెక్టర్‌పై వేటు వేసింది.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీ డైరెక్టర్ (ఫుల్ అడిషనల్ ఛార్జ్ )గా ఉన్న సోమిరెడ్డిని ఆ బాధ్యతల నుండి తప్పించింది ప్రభుత్వం.. ఇక, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేనకు తెలుగు అకాడమీ డైరెక్టర్ గా అదనపు…
తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్ వ్యవహారం సంచలనం సృష్టించింది.. ఈ వ్యవహారంలో తవ్వినా కొద్ది.. గోల్‌మాల్ అయిన డబ్బుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.. అయితే, ఈ కేసులో ఓవైపు డిపార్ట్‌మెంటల్ విచారణ సాగుతుండగా.. మరోవైపు.. తెలుగు అకాడమీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇవాళ ఇద్దరిని అరెస్ట్ చేశారు.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మస్తాన్ వలీ, ఏపీ మర్కంటైల్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ మేనేజర్ పద్మావతిని అరెస్ట్ చేశారు పోలీసులు.. కాగా, ఇప్పటి…
తెలుగు అకాడమీ నిధులు ఎక్కడి వెళ్లాయి.. ఎవరు దోచుకుపోయారు.. నాలుగు నెలల కాలంలో 63 కోట్ల రూపాయల నిధులు అదృశ్యమయ్యాయి.. ఈ నిధుల గోల్మాల్ వెనకాల ఉన్న అసలు సూత్రధారి ఎవరు.. ప్రైవేట్ కోపరేటివ్ బ్యాంకు పాత్ర ఎంత వరకు ఉంది.. యూనియన్ బ్యాంకు నుంచి డబ్బులు ఎలా డ్రా చేసుకున్నారు. ఉన్నతాధికారుల నకిలీ లెటర్స్ తో 63 కోట్ల రూపాయలు చీటర్ దోచుకున్నారు. అయితే కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారి.. పాత్రధారి ఎవరు. కథను…
తెలుగు అకాడమీలో నిధుల గోల్ మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది.. యూబీఐలో తెలుగు అకాడమీ డిపాజిట్ చేసిన రూ.43 కోట్లు హాంఫట్ అయినట్టు ఇప్పటికే ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు మరో ఫిర్యాదు అందింది.. సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి రూ.8 కోట్లు గోల్‌మాల్ అయినట్టు తాజాగా ఫిర్యాదు చేసింది తెలుగు అకాడమీ.. దీంతో.. ఇప్పటి వరకు తెలుగు అకాడమీలో గోల్‌మాల్ అయిన నిధులు రూ.51 కోట్లకు చేరుకున్నాయి.. కార్వాన్, సంతోష్‌నగర్‌లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్‌ల నుంచి ఈ…
తెలుగు అకాడమీలో అక్రమాలు వెలుగుచూశాయి.. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. వాటిని నిగ్గు తేల్చే పనిలో పడిపోయారు అధికారులు.. దాని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి.. ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ…
తెలుగు అకాడమీని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని ఎంతో ఆశగా ఉంది. కానీ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లలో తెలుగు అకాడమీని నిర్వీర్యం చేసిపడేసింది. తెలుగు అనే పేరు లేకుండా చేసేశారు. 30 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు అని తెలుగు అకాడమీ సొసైటీ ఛైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. తెలుగు భాషాభిమానులు ఆలోచన చేసుంటే ఇలాంటి దుర్ధశ పట్టేది కాదు అని తెలిపారు. ఇక వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత…
తెలుగు అకాడెమీ పేరును మారుస్తూ ఏపీ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడెమీని కాస్తా.. తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తున్నట్లుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు.…
తెలుగు అకాడమీ పేరును మార్చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. తెలుగు అకాడమీ పేరును.. తెలుగు, సంస్కృత అకాడమీగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం… ఇక, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురిని నియమించింది సర్కార్… తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి. భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకుడు డాక్టర్ నెరేళ్ల రాజ్‌కుమార్, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం విజయశ్రీ, ఎస్‌ఆర్‌ఎస్‌వి బీఈడీ కాలేజికి చెందిన లెక్చరర్ కప్పగంతు…