పార్టీ లైన్ దాటొద్దు.. జనసేన నేతలకు హెచ్చరిక..! జనసేన నుంచి తాజాగా ఓ లేఖ విడుదలైంది. పార్టీ లైన్ దాటవద్దు అనే టైటిల్‌లో లేఖను సోషల్ మీడియాలో విడుదల చేసింది పార్టీ. కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం,…
శంషాబాద్ మండలం పాలమాకుల కస్తూర్బా గురుకుల పాఠశాలను సందర్శించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. పాలమాకుల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు గత కొంతకాలంగా ఇబ్బందులకు గురవుతున్న తమను పట్టించుకునే నాధుడే లేడని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. అయితే విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు బాలికలతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుండి అన్ని…
హైదరాబాద్ నగరంలో పలుచోట్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని, అలాగానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని గతంలో హరీష్ రావు వ్యాఖ్యలపై ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మైనంపల్లి అభిమానుల పేరిట వెలసిన ఫ్లెక్సీల్లో ఈ ఫ్లెక్సీల్లో దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్…
ఒరిస్సా నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న గంజాయిని గురువారం ఉదయం రైల్లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. భువనేశ్వర్ నుంచి ముంబై వెలుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గంజాయిని పట్టుబడింది. ఖమ్మం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు మహబూబాబాద్ వరకు ప్రయాణించి రెండు సూటు కేసుల్లో అక్రమంగా తరలివెలుతున్న గంజాయిని పట్టుకున్నారు. ఈ గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు మాత్రం తప్పించుకున్నారు.
నేడు అనకాపల్లిలో పవన్ కల్యాణ్ బహిరంగ సభ. ఈ నెల 8న యలమంచిలి నియోజకవర్గంలో పవన్ పర్యటన. 9న పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొననున్న పవన్. నేడు కృష్ణాజిల్లాలో చంద్రబాబు ప్రజాగళం యాత్ర. పామర్రు, ఉయ్యూరులో చంద్రబాబు బహిరంగ సభలు. నేడు హిందూపురంలో నందమూరి బాలకృష్ణ పర్యటన. ఉదయం 11 గంటలకు కూటమి నేతలతో బాలకృష్ణ సమావేశం. దళితుల ఆత్మీయ సమావేశంలో పాల్గొననున్న బాలకృష్ణ. సాయంత్రం 7 గంటలకు ముస్లింలకు బాలకృష్ణ ఇఫ్తార్ విందు. నేడు ఐపీఎల్‌లో…
మేడారం సమ్మక్క సారక్క జాతరపై MCHRD లో మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క , రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి , డీజీపీ రవి గుప్తా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో రవాణా & బీసీ సంక్షేమ…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ చిత్రంపై నారా లోకేశ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) 2024 మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్ష ఫిబ్రవరి 28, 2024 నుండి ప్రారంభం కానుండగా.. రెండవ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 29, 2024 నుండి ప్రారంభమవుతాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం విద్యార్థులకు షెడ్యూల్ ఇంటర్మీడియట్…
బీహార్‌లో రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలను పండిస్తున్నారు. లాంగ్ ఓక్రా, రాయల్ లిచ్చి, మఖానా మరియు పుట్టగొడుగుల ఉత్పత్తిలో బీహార్ నంబర్ వన్ రాష్ట్రంగా మారింది. అయితే ఉద్యాన పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కూడా ఇస్తోంది.