కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కిస్తాం
బీఆర్ఎస్ నేత ప్రేమ్ సింగ్ రాథోడ్ శనివారం బీజేపీలో చేరారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రేమ్ సింగ్ రాథోడ్ కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ గోషామహల్ టికెట్ ఆశించిన భంగపడ్డ ప్రేమ్ సింగ్.. కాసేపటికి క్రితమే బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. అయితే.. నాగార్జునసాగర్ కు చెందిన పలువురు నేతలు సైతం బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సీట్ల కోసం చేరుతుంటారు.. ఇది సహజంగా జరిగే ప్రక్రియ అని ఆయన అన్నారు. కానీ బీజేపీలో ప్రేమ్ సింగ్ రాథోడ్ ఏం ఆశించకుండా చేరుతున్నారన్నారు. తిరిగి ఆయన తన ఇంటికి చేరుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ఈనెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందన్నారు కిషన్ రెడ్డి.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పెళ్లి పోస్టర్.. బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు..
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పెళ్లి అంటూ బీజేపీ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీని పెళ్లి పెద్దగా, ఖాజీగా అభివర్ణించింది. ఈ పోస్టర్‌పై అసదుద్దీన్ స్పందించారు. బీజేపీపై సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అందరికి పెళ్లి కొడుకునా.. లేక సోదరుడినా..? ’’ అంటూ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోడీ ఫోటో బీజేపీకి పనికిరాదని, అందుకే నా ఫోటో పెట్టారని ఓవైసీ అన్నారు. ఈ వయసులో పెళ్లికార్డులో నా ఫోటోల ఉంది, పెళ్లికాని వ్యక్తి ఫోటో పెట్టాల్సి ఉందని బీజేపీకి చురకలంటించారు. తెలంగాణలో ప్రధాని మోడీ ప్రభావం చూపకపవోడంతో బీజేపీ తన ఫోటుల వాడుకుంటుందని ఎద్దేవా చేశారు. ‘‘ఒక కార్టూన్‌లో, నేను కాంగ్రెస్, బీఆర్ఎస్ వివాహాన్ని నిర్వహిస్తున్నట్లు ఖాజీగా చూపించారు. తెలంగాణలో ప్రధాని మోడీ ఫోటో తమకు పనికి రాదని ఇప్పడు అర్థమైంది. అసదుద్దీన్ ఫోటో పెడితే వారికి లాభమని ఆలోచిస్తున్నారు. మీ మోడీ ఫోటో ఎలాంటి ప్రభావం చూపడం లేదు, కాబట్టి ఇలానే కానివ్వండి’’ అంటూ ఓ బహిరంగ సభలో బీజేపీపై కామెంట్స్ చేశారు. నేను ఖాజీ అయితే, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటానని ఓవైసీ అన్నారు.
దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మహిళ కళ్లల్లో కారం చల్లి, ఉరివేసి..
డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు జనాలు. బంధాలు, అనుబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. బంధువులు అని కూడా చూడకుండా కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యశోద అనే వివాహిత మహిళ కళ్ళల్లో కారం చల్లి, ఉరివేసి హత్య చేయబోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గుడిమెట్ల గ్రామానికి చెందిన యశోద అనే మహిళ తన భర్త నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇన్సూరెన్స్ డబ్బు ఇవ్వాలని అత్త సమీప బంధువులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారని సదరు మహిళ ఆరోపించింది. ఈ క్రమంలో నేడు ఇన్సూరెన్స్ కాగితాలపై సంతకాలు చేయాలని, కళ్ళల్లో కారం కొట్టి తనపై దాడి చేసి ఫ్యాన్‌కి ఉరివేసి, హత్య చేయబోయారని బాధిత మహిళ తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఆ బంధువులను పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం.
కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైంది
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ తమ పార్టీ మేనిఫెస్టోలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు ధర్మపురిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగిన ప్రతీ అవినీతికి కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అన్నారు. కేసీఆర్ దోచుకున్న లక్ష కోట్లను కక్కిస్తామని, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఇసుక మీద ప్రాజెక్టు కడతారా? అని ఆయన అన్నారు. కేసీఆర్‌ను కొరడాతో కొట్టినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ 200 ఎకరాల్లో వరి పండించి 1కోటి 80లక్షలు సంపాదించిండని, కేసీఆర్ వడ్లను కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండన్నారు. కానీ తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2వేల చొప్పున కూడా కొనడం లేదన్నారు రేవంత్ రెడ్డి..
‘నేను బతికే ఉన్నా యువర్ హానర్’.. తన హత్య కేసు విచారణలో ప్రత్యక్షమైన బాలుడు..
తన హత్య కేసు విచారణ జరుగుతున్న సమయంలో ‘నేను బతికే ఉన్నాను’ అంటూ ఓ పిల్లాడు కోర్టు ముందుకు రావడంతో ఒక్కసారిగా న్యాయమూర్తులతో పాటు అంతా షాక్ అయ్యారు. తన హత్య బూటకమని 11 ఏళ్ల బాలుడు ఈ రోజు సుప్రీంకోర్టు బెంచ్ ముందు హాజరయ్యాడు. బాలుడి తండ్రి, తన భార్య తరుపు కుటుంబం తన కొడుకును చంపాడని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు మొదలైంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిలిభిత్‌కి చెందిన 11 ఏళ్ల అభయ్ సింగ్ అనే బాలుడిని, అతని తల్లి తరుపు బంధువులు హత్య చేశారని తండ్రి కేసు పెట్టాడు. 2013లో బాలుడి తల్లి మరణించడంతో, అప్పటి నుంచి తాత, మేనమామల వద్ద ఉంటున్నాడు. అదనపు కట్నం కోసం బాలుడి తండ్రి, తల్లిని కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కుమార్తె మరణంపై పిల్లాడి తాత, అతని తండ్రిపై కేసు పెట్టాడు. పిల్లాడి కస్టడీ కోసం ఇటు తల్లి తరుపువారు, అటు తండ్రి పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే అభయ్ సింగ్ తండ్రి, తన కొడుకును మేనమామలు, తాత చంపాడని పిలిభిత్‌లో కేసు నమోదు చేశారు.
మహాసభ వేదికపై కంటతడి పెట్టిన మందకృష్ణ.. ఓదార్చిన ప్రధాని మోడీ
సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో మాదిగల విశ్వరూప మహాసభ జరుగుతోంది. విశ్వరూప మహాసభకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎమ్మార్పీఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ప్రధాని రాక నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ శ్రేణుల నినాదాలు మారుమ్రోగాయి. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ చేరుకున్న ప్రధాని మోడీకి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమార్పీఎస్) అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ప్రధాని మోడీ ఆలింగనం చేసుకున్న చేసుకున్నారు. మందకృష్ణ మాదిగ భుజం తట్టారు ప్రధాని మోడీ. ఈ క్రమంలో మందకృష్ట మాదిగ భావోద్వేగంతో కంటతడి పెట్టుకుని ఎమోషనల్ అయ్యారు. ప్రధాని మోడీ మందకృష్ణ వీపుపై తడుతూ ఓదార్చారు. ఈ వేదిక నుంచి ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేస్తారని పలు వర్గాలు పేర్కొన్నాయి.
దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీక.. దీపావళి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి అంటే కాంతి-వెలుగు అని సీఎం పేర్కొన్నారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీక దీపావళి అని సీఎం జగన్ తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని ముఖ్యమంత్రి కోరుకున్నారు. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని ఆకాంక్షిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
ప్రసిద్ధ దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. హౌస్ బోట్లు కాలి ముగ్గురు మృతి
ప్రముఖ పర్యాటక ప్రాంతం శ్రీనగర్ లోని దాల్ సరస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. సరస్సులోని బోట్‌హౌజులను అగ్ని చుట్టుముట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మరణించారు. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా బంగ్లాదేశ్‌కి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదంలో 5 హౌజ్ బోట్లు ధ్వంసమయ్యాయి. కాలిపోయిన మృతదేహల్లో ఒక పురుషుడు, ఒక మహిళ ఉన్నారని, మిగిలిన మృతదేహాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. అగ్నిప్రమాదంలో ఐదు హౌస్‌బోట్‌లు, వాటికి అనుబంధంగా ఉన్న గుడిసెలు సహా కోట్లాది రూపాయల విలువైన ఆస్తి కూడా దగ్ధమైంది. ప్రమాద వార్త తెలియగానే.. రెస్య్కూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నట్లు ఫైర్ ఆఫీసర్ ఫరూఖ్ అహ్మద్ వెల్లడించారు. కొంతమంది పర్యాటకులను రక్షించామని ఆయన తెలిపారు. హౌజ్ బోట్లలో చెలరేగిన మంటలు వెనువెంటనే పక్కన ఉన్నవాటికి వ్యాపించాయని, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజం
సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన మాదిగ ఉపకులాల విశ్వరూప సభకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ… మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు చెపుతున్నాయని, మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నాడన్నారు మంద కృష్ణ. అధికారం లోకి వస్తె బీసీ నీ సీఎం చేస్తా అని ప్రకటించిన దమ్మున్న లీడర్ మోడీ అని, మాదిగల కు అండగా ఉంటానని నాలుగు రోజుల్లోనే మళ్ళీ వచ్చారన్నారు. ఏ ప్రధాని రాలేదని, దళితున్ని ప్రెసిడెంట్ చేశారు… అడవి బిడ్డను రాష్ట్రపతి చేశారన్నారు.
బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచింది..
ఎన్డీయే ప్రభుత్వ తొలి లక్ష్యమే పేదరిక నిర్మూలన అని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. గుర్రం జాషువా తన కష్టాల్ని కాశీ విశ్వేశరుడికి విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. బీజేపీ మాత్రమే అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుడి దీవెనలతోనే నేను ప్రధానిగా మీ ముందు ఉన్నానన్న ప్రధాని మోడీ.. పండుగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. ఆనందం రెట్టింపు అవుతుందన్నారు. సికింద్రబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ సభకు హాజరు కావడం.. తన కుటుంబ సభ్యులతో గడిపినంత ఆనందంగా ఉందన్నారు. మందకృష్ణ తన చిన్నతమ్ముడిలాంటివాడని ప్రధాని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చాక అనేక ప్రభుత్వాలు వచ్చాయని.. సామాజిక న్యాయం అమలు చేసింది బీజేపీ మాత్రమేనన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 50 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా నవాబుపేట మండలం ఇప్పటూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు 60 మందికి పైగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలందరికీ సన్న బియ్యం, సౌభాగ్యలక్ష్మీ పథకం కింద గృహిణులకు రూ.మూడువేలు, అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక గురుకులాలతోపాటు ప్రతి ఇంటికి ఐదు లక్షల కేసీఆర్ బీమా పథకాలను తెలంగాణ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇంతటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సర్కారునే మళ్లీ ఆశీర్వదించాలని, కారుగుర్తుకు ఓటు వేసి లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.. త్వరలో కమిటీ ఏర్పాటు
మాదిగల విశ్వరూప మహా సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేస్తామని ప్రకటించారు. దీనిపై న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందన్నారు. మాదిగల ఉద్యమాన్ని తాము గుర్తించామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అంబేడ్కర్ స్వప్నాన్ని తాము నెరవేరుస్తామన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మాదిగ ఉపకులాలు బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ… బీఆర్ఎస్, కాంగ్రెస్ మాదిగలను విరోధులుగా చూస్తు్న్నాయన్నారు. ఎంతో ప్రేమతో మందకృష్ణ తమ్ముడు ఈ సభకు తనను ఆహ్వానించారన్నారు. బీజేపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారన్నారు. మాదిగల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
మోడీ గారు.. మీరు ఎస్సీ వర్గీకరణ చేయండి..
మాదిగలను పశువుల కన్నా హీనంగా చూసింది ఈ సమాజమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వాపోయారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగ విశ్వరూప మహాసభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మాటలు చెపుతున్నాయని.. మోడీ మాత్రమే సామాజిక న్యాయం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తా అని ప్రకటించిన దమ్మున్న లీడర్ మోడీ అంటూ మందకృష్ణ కొనియాడారు. మాదిగలకు అండగా ఉంటానని నాలుగు రోజుల్లోనే మళ్ళీ వచ్చారన్నారు. ఏ ప్రధాని రాలేదన్నారు. దళితున్ని ప్రెసిడెంట్ చేశారని, అడవి బిడ్డను రాష్ట్రపతి చేశారన్నారు. కాంగ్రెస్‌లో ఇవి సాధ్యం కాలేదని, వాళ్లు ఎందుకు చేయలేదన్నారు. కేసీఆర్ దీక్షను విరమింప చేసిన వారిలో నేను ఉన్నానని… కానీ ఆయన మంత్రి వర్గంలో ఒక్క మాదిగ మంత్రి లేరన్నారు. వెలమలు నలుగురు… రెడ్డీలు7 గురు మంత్రివర్గంలో ఉన్నారన్నారు. నో కాంగ్రెస్, నో బీఆర్‌ఎస్ అని.. మనకు రాజకీయాలు కాదు.. మన భవిష్యత్ ముఖ్యమని మంద కృష్ణ పేర్కొన్నారు.