2019 ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ అత్యధిక మెజార్టీతో గెలిచిన నియోజకవర్గం పోలవరం. 42 వేల ఓట్లకుపైగా మెజార్టీతో నాలుగోసారి గెలిచారు తెల్లం బాలరాజు. అయితే ఎన్నికల తర్వాత నుంచి మారుతున్న పరిణామాలతో నియోజకవర్గంలో అధికారపార్టీ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు, పునరావాస కల్పన గతంకంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ.. నియోజకవర్గ అభివృద్ది విషయంలో ఆశించిన ఫలితాలను రాబట్టడంలో ఎమ్మెల్యే వెనకపడ్డారన్నది పార్టీ శ్రేణులు చెప్పేమాట. ఈ విషయంలో వైసీపీ లోకల్ లీడర్సే బాలరాజుపై…