ఈనెల 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరుగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రాష్ట్రంలో జరుగనున్న ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ అధికారులు, విద్యా శాఖాధికారులు, సంబంధిత అధికారులతో బుధవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృత్తం కాకుండా నేడు చర్యలు తీసుకోవడంపట్ల అభినందనలు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
మూడో వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొందాం అని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల వైద్యాధికారులు, ఆశా వర్కర్లతో మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్, ఒమిక్రాన్ వేరియంట్‌ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ వైద్యసేవలను దేశానికి ఆదర్శంగా నిలుపుదామని హరీష్‌రావు పిలుపునిచ్చారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యేలా పని చేయాలని అధికారులకు సూచించారు. 15-18 ఏండ్ల వారి…
సైదాబాద్ సింగరేణి కాలనీ ఘటనను సీరియస్‌గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజు కోసం పోలీసుల వేట కొనసాగుతోంది.. ఘటన జరిగిన తర్వాత పరారైన రాజు కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు.. నిందితుడికి మద్యం అలవాటు ఉండడంతో.. అన్ని మద్యం షాపులు, కల్లు దుకాణాల వద్ద నిఘా కూడా పెట్టారు.. ఇక, ఈ నేపథ్యంలో.. అన్ని జిల్లాల ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి.. జిల్లాలోని అన్ని…