Rains Alert: తెలంగాణలో వర్షాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి టెలీకాన్ఫరెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబబాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. నేడు, రేపు రెండు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
Read Also: Rajasthan: రాజస్థాన్ సీఎంపై ఉత్కంఠ..60 మంది ఎమ్మెల్యేలకు వసుంధర రాజే ఫోన్..
Also Read
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ఇక, భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండాలి.. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల దగ్గర తగిన జాగ్రత చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే ఏర్పాటు చేయాలని సీఎస్ శాంతి కుమారి సూచించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!