2G Services Shut Down Demand: ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల 4జీ, 5జీ సేవలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల మూసివేతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, సంస్థలకు 5జీ సేవలను అందించడానికి విజయవంతమైన బిడ్డర్లకు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీని ప్రకారం 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ జులై 2022 చివరి నాటికి వేలం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ 5G సేవలు అందుబాటులోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని.. అలాగే…
దేశంలో ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా 5జీ టెలికాం సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 2022, ఆగస్టు 15 కల్లా 5జీ సేవలు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రధానమంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. దీంతో 5జీ స్పెక్ట్రానికి సంబంధించిన సిఫార్సులను మార్చికల్లా అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. వివిధ బ్యాండ్‌లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణం, ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్ చేయనుంది. అటు అల్ట్రా హైస్పీడ్…