హైదరాబాద్‌లోని దోమలగూడలో గ్యాస్ సిలీండర్ పేలుడు ఘటనలో మరొకరు మరణించారు. దీంతో ఈ ప్రమాద సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఈ నెల 10వ తేదీన గ్యాస్ సిలీండర్ లీక్ కావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.