బీఆర్ఎస్లో కీలకమైన పరిణామాలు జరగబోతున్నాయా? ఎమ్మెల్సీ కవిత ఇక పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనా? అంటే... మారుతున్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అమెరికా ట్రిప్ నుంచి వచ్చాక కవిత రాజకీయ కదలికల్ని నిశితంగా గమనిస్తున్నవారంతా... అదే అభిప్రాయంతో ఉన్నారట.
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం. ఇద్దరు సీఎంలతో... కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన మీటింగ్ అనగానే... రెండు రాష్ట్రాల్లో ఒకటే ఉత్కంఠ. అందునా.... బనకచర్ల సెంట్రిక్‌గా...పొలిటికల్ పంచ్‌లు హాట్ హాట్‌గా పేలుతున్న వేళ ఆ ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయా?
హుజూరాబాద్.. పొలిటికల్‌గా తెలంగాణ మొత్తం మీద ప్రత్యేక గుర్తింపు ఉన్న కొద్ది నియోజకవర్గాల్లో ఒకటి. సీనియర్ లీడర్ ఈటల రాజేందర్‌కి నిన్న మొన్నటి దాకా కంచుకోట ఇది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో... గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజూరాబాద్ రెండింట్లో పోటీ చేసి.. రెండు చోట్లా ఓడిపోయారాయన.
CM Chandrababu: తెలంగాణ రాష్ట్రంతో గొడప పడే అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృధ్ధి చేసే బాధ్యత నాది అన్నారు. ఇక, గోదావరి నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకుంటాం.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది జలశక్తి శాఖ.. రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల జలవనరుల మంత్రులు, రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు హాజరయ్యారు.. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నీటి…
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది బీజేపీ. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక... ఫస్ట్ టాస్క్ కాబట్టి... ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట. అందుకే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టినట్టు సమాచారం. మండల పార్టీ అధ్యక్షులకు వర్క్‌షాప్స్ పేరుతో పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. అయినా సరే.... పార్టీలో ఏదో... వెలితి కనిపిస్తూనే ఉందట. కారణం ఏంటంటే... నేతలు ఐక్యతా రాగం వినిపించడం లేదన్నది సమాధానం.
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి రాజకీయం మండుతోంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పర్వం తారా స్థాయికి చేరిపోయింది. ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనుచరుల దగ్గర మొదలైన గొడవ... చినికి చినికి గాలి వానాగా మారి ప్రకంపనలు రేపుతోంది.
KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే…